'సర్కారు వారి పాట' మూవీ రివ్యూ & రేటింగ్!

By iQlikMovies - May 12, 2022 - 10:43 AM IST

మరిన్ని వార్తలు

నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, నదియా, వెన్నెల కిషోర్ తదితరులు.
దర్శకత్వం : పరశురాం పెట్ల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపి ఆచంట
సంగీత దర్శకుడు: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్


రేటింగ్ : 2.5/5


మహేష్ బాబుకి మాస్ లో ఎంత ఫాలోయింగ్ వుందో క్లాస్ లో కూడా అంతే ఆడియన్స్ వున్నారు. అందుకే మహేష్ తో సినిమా అంటే అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటారు దర్శకులు. పరశురాం కూడా అదే చేశాడు. ఒక పాన్ ఇండియా పాయింట్ ని తీసుకొని ఆ పాయింట్ చుట్టూ కమర్షియల్ హంగులు అద్దాడు. మరి ఈ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్ళలో కలిశాయా ? అటు మాస్ ఇటు క్లాస్ ని మహేష్ బాబు ఆకట్టుకున్నారా ? ట్రైలర్ లో చూపించిన ఎనర్జీ సినిమాలో కంటిన్యూ అయ్యిందా ? ఇంతకీ ఏమిటి సర్కారు వారి కథ ?


కథ:


అమెరికాలో ఫైనాన్స్ బిజినెస్ చెస్తుంటాడు మ‌హేశ్‌ (మ‌హేశ్‌బాబు). తన వ్యాపారానికి తనే రికవరీ ఏజెంట్. మహేష్ ది మామూలు రికవరీ కాదు. అప్పు తీసుకున్నది ఎవరైనా చెప్పిన టైంకి తిరిగి ఇచ్చేయల్సిందే. లేదంటే..స్వయంగా రంగంలో దిగి ముక్కుపిండీ మరీ వసూలూ చేసేస్తాడు. రాజేంద్రనాథ్ (సముద్రఖ‌ని) వైజాగ్ లో బడా బిజినెస్ మ్యాన్. బ్యాంకులు దగ్గర లోన్ తీసుకొని ఎగ్గొట్టి ఆస్తులు, పలుకుబడి కూడబెట్టుకోవడం అతడి స్టయిల్. క‌ళావ‌తి (కీర్తిసురేష్‌) రాజేంద్రనాథ్ కూతురు. అమెరికాలోనే చ‌దువు కోసమ‌ని పంపిస్తే.. గాంబ్లింగ్ ని అలవాటు చేసుకొని అందరిదగ్గర అప్పులు తీసుకుంటుంది.


అలా మ‌హేశ్‌ ద‌గ్గర కూడా పది వేల డాలర్లు అప్పుతీసుకుంటుంది. సరైన ఆధారాలు లేనిది చిల్లీ గవ్వకూడా అప్పు ఇవ్వని మహేష్ , కళావతి మాయమాటలకు పడిపోతాడు. ఐతే తొందరిలోనే కళావ‌తి నిజస్వరూపం మ‌హేశ్‌కి తెలిసిపోతుంది. దీంతో తాను ఇచ్చిన అప్పు తిరిగిచ్చేయ‌మ‌ని అడుగుతాడు. ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోమని రివర్స్ లో వార్నింగ్ ఇస్తుంది. అంతేకాదు తనతండ్రి రాజేంద్రనాథ్ తో కూడా వార్నింగ్ ఇప్పిస్తుంది. అప్పుడు మహేష్ తన డబ్బుని వసూలు చేయడానికి వైజాగ్ వెళ్తాడు.. తర్వాత ఏం జరిగింది ? రాజేంద్రనాథ్ డబ్బు తిరిగిఇచ్చాడా ? వీరిద్దరి మధ్య ఎలాంటి పోరాటం జరిగిందనేది మిగతా కథ.


విశ్లేషణ :


సినిమా కథ చేయడానికి పాయింట్ కొత్తగా వుండాలి. సర్కారు వారి పాయింట్ రెగ్యులర్ న్యూస్ పేపర్ లో కనిపించే వార్తే. కానీ పాయింట్ నే కొత్తగా మలుచుకున్నాడు పరశురాం. విజయ్ మాల్య కోట్లు ఎగ్గొట్టి హాయిగా లండన్ లో గడుపుతున్నాడు. కానీ కొడుకు చదువుకి లోన్ తెచ్చిన ఓ తండ్రి ఆ లోన్ ని సరైన సమయానికి కట్టకపోతే బ్యాంకు వాళ్ళు నానా యాగీ చేస్తారు. చివరికి పరువుపోయిందని ఆత్మ హత్యలు చేసుకున్న తండ్రులు కూడా ఈ దేశంలో చాలా మంది వున్నారు. చడువుకనే కాదు.. వ్యవసాయానికి, ఇల్లు కట్టుకోవడం ఇలా ఏదైనా. ఐతే సంఘంలో వున్న పెద్ద వాళ్ళు మాత్రం పలుకుబడితో తప్పించుకొని మాఫీ చేసుకుంటారు. దీనికి ప్రజలు మూకుమ్మడిగా తిరగబడితే.. ఎలా వుంటుంది ?? సర్కారు వారి పాట కూడా ఇదే ఐడియా. ఐతే ఈ ఐడియాని సినిమాగా మార్చే క్రమంలో తడబడిపోయాడు దర్శకుడు పరశురాం.


నిజానికి పరశురాంది మాస్ జోనర్ కాదు. శంకర్ లాంటి దర్శకులు ఇలాంటి పాయింట్లు డీల్ చేస్తుంటారు. సర్కారువారి పాట చూశాక.. పాయింట్ బావుంది కానీ ఇంకోలా తీసుకుంటే బావుండేదనే ఫీలింగ్ ప్రేక్షకుడిలో కలుగుతుంది. తనకు పట్టువున్న లవ్ ట్రాక్ ని ఫ్రెష్ గా నడిపిన పరశురాం.. అసలు పాయింట్ దగ్గర =కి వచ్చేసరికి చేతులు ఎత్తేశాడు. సర్కారు వారి పాట కథ చాలా మందికి కనెక్టింగ్ వుంటుంది. అలాంటి పాయింట్ పట్టుకున్నపుడు చాలా పకడ్బందీగా వుండాలి. కానీ పరశురాం వేసుకున్న సీన్లు చాలా సిల్లీగా వున్నాయి. అంతేకాదు శ్రుతిమించిన సినిమా లిబార్టీ తీసుకున్నాడు. ఒక సీన్ చూద్దాం.. వైజాగ్ ప్రజలు తీసుకున్న లోన్ కి ఈఎంఐ చెల్లించమని నిరసనకు దిగుతారు. వైజాగ్ డాన్  రాజేంద్రనాథ్ తన దగ్గర వున్న మనుషులతో వైజాగ్ లో ఇంటికి ఒకడిని కిడ్నాప్ చేసి బెదిరించి లోన్ కట్టించడానికి సిద్దపడుతుంది. ఈ సీన్ చూసినప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తుంది. వైజాగ్ జనాబా ఎంత ,, ఇంటికో మనిషిని కిడ్నాప్ చేయాలంటే ఎంతమంది ప్రైవేట్ ఆర్మీ కావాలి ? ఇలాంటి చిన్నచిన్న లాజిక్కులని కూడా అలోచించలేదు.


సర్కారు వారి యూనిట్ ఈ సినిమాలో లవ్ ట్రాక్ గురించి చాలా గొప్పగా చెప్పింది. యూనిట్ చెప్పినంత గొప్పగా లేదు కానీ ఈ సినిమాలో అదే కొంత రిఫ్రషింగ్. ఫస్ట్ లో దాదాపు ఇదే ట్రాక్ తో నడిపేశారు. కొన్ని సీన్లు అలరించాయి. కళావతి పాట బావుంది. మహేష్ ఇంట్రో ఫైట్ వాటేండ్ గా పెట్టినట్లనిపించింది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర పడుతుందనగా అసలు కథలోకి వెళ్ళాడు దర్శకుడు. ఇంటర్వెల్ 
బాంగ్ లో ఇచ్చిన చమక్ కూడా బావుంది.


అయితే సెకండ్ హాఫ్ మొదలవ్వడంతోనే సర్కారు వారి పాటకు అసలు సమస్య మొదలౌతుంది. కథ అక్కడక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది. కథ లో వేగం రావడానికి చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు. లారీ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళుతుందనే అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకుడిని మళ్ళీ కూల్ గా చైర్ లో కూర్చోబెట్టేశారు. సెకండ్ హాఫ్ లో కీర్తి సురేష్ పాత్రని వాడుకున్న విధానం మాస్ కి నచ్చుతుందని డిజైన్ చేశారు కానీ అది కొంచెం ఎబెట్టుగా వుంటుంది. క్లైమాక్స్ లో హీరో విన్ అవుతాడని అందరికీ తెలుసు. ఒక పెద్ద యాక్షన్ సీన్ కండక్ట్ చేసి.. ప్రేక్షకుడు ఊహించినే ముగింపే ఇచ్చేశారు


నటీనటులు :


మహేష్ బాబు వన్ మ్యాన్ షో సర్కారు వారి పాట. మహేష్ పాత్రని చాలా సలువుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇందులో మరింత అందంగా కనిపించాడు. కొన్ని సీన్స్ లో నటన కూడా టాప్ క్లాస్ కనిపిస్తుంది. వైజాగ్ నడిరోడ్డు మీద ఒక రికవరీ ఏజెంట్ యాటిట్యూడ్ అద్భుతం అనిపిస్తుంది. తన పాత్రని చాలా బాగా అర్ధం చేసుకొని చేశాడు. హీరోకదా అని ప్రతిదానికి చేయి చేసుకోవడం వుండదు. కారెక్టర్ ని చక్కగా ఫాలోయ్యాడు. యాక్షన్ సీన్స్, డ్యాన్స్ లో  లో అదుర్స్ అనిపించాడు. తన పాత్రకి ఏం కావాలో అది చేశాడు. కీర్తి సురేష్ పాత్ర ని డిజైన్ చేసిన విధానం బావుంది.ఫస్ట్ హాఫ్ లో కీర్తి పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. మాస్ డ్యాన్స్ లు కూడా ఆదరగొట్టింది.


సముద్రఖని విలనిజాన్ని డిగ్నిఫైడ్ గా చేశారు. ఆ పాత్రలో అండర్ ప్లే వుంటుంది. బాడీ లాంగ్వెజ్ తోనే భయపెట్టారు. వెన్నల కిషోర్ పాత్ర నవ్విస్తుంది. నదియా పాత్ర చిన్నదే అయినా కథలో ముడిపడి వుంటుంది. నాగబాబు పార్వతి లోకేష్ కూడా కథకు సీరియస్ బిగినింగ్ ఇచ్చారు. సుబ్బరాజ్ పాత్ర ఓకే.. సత్య రాజేష్ పాత్రని కామెడీ కోసం వాడుకొనే అవకాశం వున్నా ఆ చాయిస్ తీసుకోలేదు. తనికెళ్ళ భరణి పాత్ర కూడా ఆకట్టుకుంది. మిగతా పాత్రలు పరిధి మేర చేశారు


సాంకేతికంగా :


టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా వుంది. మధి కెమరా పనితనం రిచ్ గా వుంది. తమన్ పాటలు రీ రికార్డింగ్ రెండూ బావున్నాయి. ఫైట్స్ లో రామ్ లక్ష్మన్ మాస్టర్ కొత్తదనం చూపించారు. ఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ కూడా ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ లో కొంత ట్రిమ్ చేయొచ్చు. పరశురాం రాసిన కొన్ని డైలాగ్స్ పేలాయి. నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు


ప్లస్ పాయింట్స్


మహేష్ బాబు
లవ్ ట్రాక్
 కొన్ని యాక్షన్ సీన్లు
పాటలు


మైనస్ పాయింట్స్


బలహీనమైన కథనం
ఆకట్టుకొని ఎమోషన్స్
అసహజంగా వుండే కొన్ని సన్నివేషాలు


ఫైనల్ వర్దిక్ట్ : సర్కారు వారి పాటలో సౌండ్ తగ్గింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS