నటీనటులు: రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్, శివాని రాజశేఖర్ తదితరులు.
దర్శకత్వం : జీవిత రాజశేఖర్
నిర్మాత: బీరం సుధాకర రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గరం వెంకట శ్రీనివాస్.
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ నరగాని
రేటింగ్ : 2.5/5
రాజశేఖర్ కెరీర్ కి కొత్త ఊపు తెచ్చింది గరుడ వేగ. ఈ సినిమా విజయంతో మళ్ళీ జోష్ లోకి వచ్చారు. ప్రశాంత్ వర్మతో చేసిన కల్కి సినిమా కూడా ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు రాజశేఖర్ కోసం స్వయంగా జీవిత దర్శకురాలిగా మారి శేఖర్ చిత్రాన్ని తెరకెక్కించారు. మలయాళం హిట్ జోసెఫ్ కి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథలోకి వెళితే..
కథ :
శేఖర్ (రాజశేఖర్) నిజాయితీ పరుడైన కానిస్టేబుల్. చాలా ఇంటెల్జెంట్. అయితే వాలెంటరీ రిటైర్‌మెంట్ తీసుకుంటాడు. తన జీవితంలో జరిగిన సంఘటన కారణంగా భార్యతో విడిపోతాడు. శేఖర్ కూతురు ( శివాని). ఒకరోజు శేఖర్ మాజీ భార్య ఇందు యాక్సిడెంట్ లో చనిపోతుంది. అంతకుముందు శేఖర్ కూతురు కూడా ఇలానే యాక్సిడెంట్ లోనే చనిపోతుంది. అయితే ఇవి రోడ్డు ప్రమాదాలు కావని, వీటి వెనుక ఓ కుట్ర ఉందని గమనిస్తాడు శేఖర్. ఆ కేసుని తానే ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలెడతాడు. ఆ క్రమంలో శేఖర్‌కి ఎలాంటి నిజాలు తెలిశాయి..? శేఖర్ జీవితంలో వున్న విషాదం ఏమిటి ? ఈ కేసు వెనుక ఎవరున్నారనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
మలయాళంలో అదిరిపోయే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లు వస్తుంటాయి. జోసెఫ్ కూడా ప్రేక్షకుడికి థ్రిల్ పంచిన థ్రిల్లరే.ఆర్గాన్ డొనేషన్ లో జరుగుతున్న మాఫియాని దర్శకుడు థ్రిల్లింగా చూపించిన విధానం ఆకట్టుకుంది. తెలుగులోకి వచ్చేసరికి శేఖర్ కాస్త ఆలస్యమయ్యాడనిపిస్తుంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన కథ ఇది. ఇప్పటికే ఇలాంటి జోనర్ కథలు చాలా వచ్చాయి. దీంతో శేఖర్ లో వున్న ఫ్రెష్ నెస్ తగ్గింది.
శేఖర్ ఇంటెల్జన్స్ చూపించే సీన్ తో ఫస్ట్ హాఫ్ మొదలౌతుంది.ఐతే ఆ వెంటనే శేఖర్ ఫ్లాష్ బ్యాక్ లోకి కథ వెళుతుంది. అతని ప్రేమ, పెళ్లి, విడాకులు కాస్త సాగాదీతగా అనిపిస్తాయి. పైగా ఒక రాంగ్ ప్లేస్ లో వచ్చిన పాటలు కూడా ఇబ్బంది పెడతాయి. ఫ్లాష్ బ్యాక్.. శేఖర్ కుటుంబంలో సమస్యలు ఇవే ప్రథమార్ధంలో ఎక్కువ రన్ టైం తీసుకున్నాయి. ఫ్లాష్ బ్యాక్ అయినతర్వాత కూడా ఫ్యామిలీ సీన్స్ భారంగా అనిపిస్తాయి.
తన మాజీ భార్యది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని శేఖర్ గుర్తించి దాని వెనుక వున్నా మిస్టరీని ఛేదించే ద్వితీయార్ధంలో వుంటుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా బెటర్ గా వుంటుంది. నిజానికి ఈ సినిమా అసలు పాయింట్ సెకండ్ హాఫ్ లోనే వుంది. చివరి ఇరవై నిమిషాలు థ్రిల్లింగా వుంటుంది. మెడికల్ మాఫియా వెనుక వున్న ట్విస్ట్ లు ఒకొక్కటిగా రివిల్ అవుతాయి. అప్పటికే సాగదీత వ్యవహరంతో విసిగిపోయిన ప్రేక్షకుడు ఇది కొంత ఉపసమనం కలిగిస్తుంది. నిజానికి శేఖర్ మంచి పాయింట్. ఐతే అనవసరమైన ఫ్లాష్ బ్యాక్, సాగాదీత ఎపిసోడ్ల తో లాగ్ చేశారు. అసలు పాయింట్ చుట్టే డ్రామా నడిపుంటే ఫలితం మరోలా వుండేది.
నటీనటులు :
‘శేఖర్’ పాత్రని చాలా సులువుగా చేసుకుంటూ వెళ్లారు రాజశేఖర్. ఆయన లుక్ కొత్తగావుంది. ఐతే ఆయనలో కాస్త హుషారు తగ్గింది. శివాని పాత్ర బావుంది. హీరోయిన్ ముస్కాన్ ఓకే. ఆత్మీయ రాజన్ ఈ పాత్రకి నప్పులేదు. ప్రకాష్ రాజ్, కిషోర్.. సమీర్.. అభినవ్ గోమఠం తమ పాత్రల పరిధిలో చేశారు.
టెక్నికల్ గా :
అనూప్ రూబెన్స్ నేపధ్య సంగీతం సంగీతం బావుంది,. పాటలు సోసోగా వున్నాయి. మల్లికార్జున్ నారగాని ఛాయాగ్రహణం ఓకే. దర్శకురాలు జీవిత ఒరిజినల్ ని ఫాలో అయ్యారు. పెద్ద మార్పులు కనిపించవు. నిర్మాణ విలువలు పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్ :
రాజశేఖర్ నటన
కొత్త పాయింట్
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్ :
సాగాదీత స్క్రీన్ ప్లేయ్
పాటలు
ఫైనల్ వర్దిక్ట్: శేఖర్.. జస్ట్ ఓకే