ఆచార్య చిరు కెరీర్‌లోనే పెద్ద ఫ్లాప్. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది? అసలు తప్పెక్కడ జరిగింది? అనే విషయంలో చిరు అప్పుడే పోస్ట్ మార్టమ్ చేసేశారు. తను అతిగా జోక్యం చేసుకోవడం వల్ల, దర్శకుడికి కావల్సినంత ఫ్రీడమ్ ఇవ్వకపోవడం వల్ల... ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని ఆయన ఓ అంచనాకి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే తన తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. దర్శకులకు కావల్సినంత స్వేచ్ఛ ఇచ్చి, తన జోక్యం పూర్తిగా తగ్గించేయాలన్న నిర్ణయానికి చిరు వచ్చారని సమాచారం.
ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరు. మరోవైపు మెహర్ రమేష్ సినిమా కూడా ఉంది. ఈ సినిమాల కథ, టేకింగ్ విషయంలో ముందు నుంచీ చిరు జోక్యం ఎక్కువగానే ఉంటూ వచ్చిందని సమాచారం. అయితే ఆచార్య ఫలితం తరవాత... మేకింగ్ విషయంలో చిరు పెద్దగా పట్టించుకోవడం లేదని, దర్శకులకు ఫ్రీడమ్ ఇచ్చేశారని, రాబోయే సినిమాల్లోనూ ఇదే పంథా అనుసరించబోతున్నారని సమాచారం. ఆచార్య ఫలితంలో చిరులో వచ్చిన పెద్ద మార్పు ఇది. అగ్ర హీరోలు తమ సినిమాలు బాగా రావాలన్న తపనతో, తమ అనుభవంతో.. కథలో, టేకింగ్ లో వేళ్లూ, కాళ్లూ పెడుతుంటారు. వాళ్లంతా ఇప్పుడు మారాల్సిన అవసరం ఉందేమో?