స్టాండప్ రాహుల్ రివ్యూ &రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: రాజ్  తరుణ్, వర్ష బొల్లమ్మ, మురళి శర్మ, ఇంద్రజ తదితరులు
దర్శకత్వం : శాంటో
నిర్మాతలు: నంద్ కుమార్, భరత్
సంగీత దర్శకుడు: స్వీకర్ అగస్తి
సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్ రవీంద్రన్
ఎడిటర్ : రవితేజ గిరజాల


రేటింగ్: 2.25/5


యువ హీరోల్లో రాజ్ తరుణ్ ఒక కెరటంలా దూసుకొచ్చాడు. వరుసగా విజయాలు అందుకున్నాడు. రాజ్ తరుణ్ సినిమా అంటే ఫన్ పక్కా అనే పేరు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా రాజ్ కి విజయాలు లేవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్టు మాత్రం రావడం లేదు. చాలా జోనర్లు ట్రై చేస్తున్నాడు. కానీ కలసిరావడం లేదు. ఇప్పుడు ట్రెండ్ లో వున్న స్టాండప్ కామెడీ నేపధ్యం చుట్టూ ఓ సినిమా చేశాడు. అదే ' స్టాండప్ రాహుల్'. మరి ఈ సినిమా రాజ్ తరుణ్ కి విజయాన్ని ఇచ్చిందా? అతడు కోరుకున్న హిట్ దక్కిందా ? ఒక్కసారి రివ్యూలోకి వెళితే..


కథ :


రాహుల్ (రాజ్ తరుణ్)కి స్టాండప్ కామెడీ ఇష్టం. కానీ రాహుల్ తల్లి (ఇంద్రజ) సలహా మేరకు ఓ కంపెనీలో జాబ్ కి చేరతాడు. రాహుల్ కి శ్రేయ (వర్ష బొల్లమ్మ) పరిచయం అవుతుంది. వర్షని ప్రేమిస్తాడు. కానీ మనసులో మాట చెప్పడు. ఇంకో కారణం ఏమిటంటే.. రాహుల్ కి పెళ్లి అంటే ఇష్టం వుండదు. శ్రేయకి మాత్రం పెళ్లి మంచి అభిప్రాయం వుంటుంది. మరి ఈ ఇద్దరి జంట ప్రయాణం ఎలా సాగింది ? రాహుల్ కి పెళ్లి అంటే ఇష్టం లేకపోవడానికి గల కారణం ఏమిటి ? అనేది మిగతా కథ


విశ్లేషణ:


కొంతమంది దర్శకుడు కొత్త కథ చెప్పడానికి ప్రయత్నించరు. పాత పాయింట్ నే కొత్తగా ప్రజంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. స్టాండప్ రాహుల్ చిత్ర దర్శకుడు శాంటో కూడా అదే చేశాడు. అయితే పాత పాయింట్ కొత్త ప్రజంట్ చేసేటప్పుడు ప్రజంటేషన్ కొత్తగా వుండాలి. కానీ స్టాండప్ రాహుల్ లో ఆ కొత్తదనం లోపించింది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకుడి ఊహకు ముందే అందిపోతూ సోసోగా సాగిపోతుంది. తల్లితండ్రుల విడాకులు తీసుకున్నారని, కొడుకు పెళ్లి అనే బంధంపై అయిష్టంగా వుండటం అనేది పాత పాయింట్. ఆ పాయింట్ కి అర్బన్ టచ్ ఇచ్చి స్టాండప్ కామెడీ నేపధ్యం జోడించి కథని ముందుకు నడిపించాలని అనుకున్నాడు దర్శకుడు. అయితే ఇందులో ఎమోషన్, కామెడీ రెండూ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.


సినిమా ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ సాగుతుంది. హీరో చుట్టూ అల్లుకున్న నేపధ్యం, అతని పాత్ర ప్రేక్షకుడి ముందే అర్ధమైపోతుంది. కామెడీగా చేసిన కొన్ని సీన్లు విసుగుని కూడా తెపిస్తాయి. అయితే ప్రేమకథలో వచ్చిన ప్రీ-ఇంటర్వెల్ బాంగ్ కొంచెం ఆసక్తిని పెంచుతుంది. అయితే తర్వాత మళ్ళీ రొటీన్ వ్యవహారం గా తయారౌతుంది.


సెకండ్ హాఫ్ వచ్చేసరికి కూడా కథలో ఎలాంటి మూమెంట్ వుండదు. అయితే మొదటి సగంతో పోల్చుకుంటే రెండో సగంలో వచ్చిన కొన్ని కామెడీ సీన్లు నవ్విస్తాయి. ఇక క్లైమాక్స్ ఏమిటనేది ప్రేక్షకుడికి ఆరంభం లోనే తెలిసిపోతుంది కాబట్టి.. అది కూడా రొటీన్ గా ముగుస్తుంది. చెప్పడానికి పెద్ద కథ లేనప్పుడు కామెడీ సీన్లు అయిన బలంగా రాసుకోవల్సింది. కానీ స్టాండప్ రాహుల్ లో అదీ జరగలేదు. టోటల్ గా సినిమా ఎలాంటి అనుభూతిని ఇవ్వకుండా పరమ రొటీన్ గా ముగిసిపోతుంది.


నటీనటులు :


రాజ్ తరుణ్ మంచి నటుడు. రాహుల్ పాత్రని చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రాజ్ డ్రెస్సింగ్ స్టయిల్, గెటప్ అల్ట్రా మోడరన్ గా వుంటాయి. అయితే కథలో బలం లేకపోవడంతో కొన్ని చోట్ల రాజ్ నటన కూడా తెలిపోయినట్లనిపిస్తుంది. ఇందులో రాజ్ తరుణ్ తప్పులేదు. కామెడీ చేయడం చాలా కష్టం. అందులోనూ సన్నివేషంలో బలం లేనప్పుడు కామెడీ చేయడం ఇంకా కష్టం.


ఈ సినిమాలో రాజ్ తరుణ్ కి అదే ఇబ్బంది ఎదురైయింది. వర్ష బొల్లమ్మ అందంగా కనిపించింది. ఎమోషన్ సీన్స్ లో చక్కగా అభినయించింది. మురళీ శర్మ, ఇంద్రజ అనుభవంతో వారి పాత్రలు న్యాయం చేశారు. వెన్నల కిషోర్ నవ్వించదానికి ప్రయత్నించాడు కానీ రైటింగ్ లో బలం లేకపోవడంతో ఫన్ పండలేదు. మిగతా నటులు పరిధి మేర చేశారు


టెక్నికల్ గా :


స్వీకర్ అగస్తి ట్రెండీ మ్యూజిక్ అందించాడు. అయితే పాటలు పెద్దగా రిజిస్టర్ కావు. నేపధ్య సంగీతం మాత్రం ఓకే. కెమరాపనితనం బావుంది.,విజువల్స్ రిచ్ గా వున్నాయి. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు రైటింగ్ టేబుల్ పై ఇంకాస్త కసరత్తు చేసి వుంటే కనీసం కామెడీ వర్క్ అవుట్ అయినా స్టాండప్ రాహుల్ పాస్ అయ్యేవాడు.


ప్లస్ పాయింట్స్


స్టాండప్ కామెడీ నేపధ్యం
రాజ్ తరుణ్ , వర్ష బోల్లమ్మ
సెకండ్ హాఫ్ లో కొంత ఫన్


మైనస్ పాయింట్స్


రొటీన్ కథ
బలహీనమైన కధనం
కామెడీ, ఎమోషన్స్ పండకపోవడం


ఫైనల్ వర్దిక్ట్ : స్టాండప్ రాహుల్.. నిలబడలేదు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS