యూ టర్న్‌ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

తారాగణం: సమంత, భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌ తదితరులు
సంగీతం: పూర్ణ చంద్ర
సినిమాటోగ్రఫీ: నికిత్‌ బొమ్మిరెడ్డి
నిర్మాతలు: శ్రీనివాస్‌ చిట్టూరి, రాంబాబు బండారు
దర్శకత్వం: పవన్‌కుమార్‌
నిర్మాణం: శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌, వివై క్రియేషన్స్‌, బిఆర్‌8 క్రియేషన్స్‌

రేటింగ్‌: 2.75

కథ

ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తుంటుంది రచన (సమంత). ఆర్కేపురం ఫ్లై ఓవర్‌పై జరిగే యాక్సిడెంట్లకు సంబంధించి రీసెర్చ్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే యూ టర్న్‌ తీసుకున్న వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయడంతోపాటుగా, వారి వెహికిల్‌ నెంబర్స్‌ని కూడా కలెక్ట్‌ చేస్తుంటుంది రచన. వారిలో సుందరం అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేందుకు వెళుతుంది. అయితే సుందరం చనిపోతాడు. ఆ హత్య కేసు రచన మెడకు చుట్టుకుంటుంది. విచారణాధికారి నాయక్‌ (ఆది)కి రచన, ఆ హత్య చేయలేదని తెలుస్తుంది. మరోపక్క, రచన కలెక్ట్‌ చేసిన నెంబర్‌ ప్లేట్స్‌ ఏ వాహనాలవో, ఆ వాహనాలకు చెందినవారు ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ మిస్టరీని నాయక్‌, రచన ఎలా ఛేదించారన్నదే మిగతా కథ.

 

నటీనటులు

నటిగా ఎప్పుడో మంచి మార్కులేయించుకున్న సమంత, కెరీర్‌లో కమర్షియల్‌ సినిమాలతోపాటు విలక్షణమైన సినిమాలూ చేసి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆమె నటనలో సినిమా సినిమాకీ పరిణతి కన్పిస్తోంది. ఈ మధ్య మరింత విలక్షణతతో కూడిన సినిమాల ఎంచుకుంటున్న సమంత, ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఆ విలక్షణతే. తన పాత్రకు సమంత పూర్తి న్యాయం చేసింది.

ఆది పినిశెట్టి స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఏ సినిమాకైనా ఓ డిఫరెంట్‌ అప్పీల్‌ని తీసుకొస్తుంది. ఈ సినిమాకీ ఆది పినిశెట్టి కంప్లీట్‌ ఎఫర్ట్‌ పెట్టాడు. ఇంట్రెస్టింగ్‌ రోల్‌లో భూమిక తన అనుభవాన్నంతా రంగరించింది. రాహుల్‌ రవీంద్రన్‌ ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర ఓకే అన్పిస్తారు.

విశ్లేషణ

థ్రిల్లర్‌ మూవీ, పైగా ఇది డబ్బింగ్‌ మూవీ. ఒరిజినల్‌లోని చిన్న చిన్న లోటుపాట్లను కవర్‌ చేసేలా వుండాలి. అయితే దర్శకుడు ఒరిజినల్‌తో పోల్చితే డబ్బింగ్‌లో కొంచెం తడబాట్లు ప్రదర్శించినట్లు అన్పిస్తుంది. సాగతీత సన్నివేశాలు సినిమా వేగాన్ని తగ్గించేశాయి. సమంత - రాహుల్‌ ట్రాక్‌ బోరింగ్‌గా అన్పిస్తుంది. ఈ తరహా కథల్ని తెరకెక్కించేటప్పుడు ఎక్కడా పట్టు కోల్పోకూడదు. గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో కట్టిపడేయాలి. అయితే చాలా తడబాట్లు సినిమా వేగాన్ని తగ్గించేసి, ప్రేక్షకుడికి బోర్‌ కొట్టించేలా చేశాయి. మంచి తారాగణం వున్నా, దర్శకుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

సాంకేతిక వర్గం

సినిమా రిచ్‌గానే తెరకెక్కింది. టెక్నికల్‌ యాస్పెక్ట్‌లో చూస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. ఎడిటింగ్‌ పదును తప్పింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. డైలాగ్స్‌ బాగానే వున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌

+ సమంత
+ ఆది
+ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌

మైనస్‌ పాయింట్స్‌

- సాగతీత

ఫైనల్‌ వర్డిక్ట్‌: యూ టర్న్‌ - రీమేక్‌ జస్ట్‌ ఫర్లేదంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS