Yashoda Review: 'యశోద'మూవీ రివ్యూ &రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: సమంత, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్ తదితరులు
దర్శకుడు : హరి – హరీష్
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్
సంగీత దర్శకులు: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: ఎం. సుకుమార్
ఎడిటర్: మార్తాండ్. కె. వెంకటేష్


రేటింగ్ : 2.5/5


గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యత గల చిత్రాలతోనూ ఆకట్టుకుంది సమంత. ఒక దశ వచ్చిన తర్వాత కేవలం కమర్షియల్ గా నెట్టుకురావడం కష్టమనే సంగతి గ్రహించి ‘యూ ట‌ర్న్‌‘, ‘ఓ బేబి’ చిత్రాలతో పాటు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరిస్ లో తన విలక్షణతని చాటింది. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'యశోద'. ఈ సినిమా ట్రైలర్ అంచనాలు పెంచింది. మరి చాలా రోజుల తర్వాత సమంత నుండి వచ్చిన యశోద ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ? ట్రైలర్ తో పెంచిన అంచనాలని సినిమా అందుకుందా ?


కథ:


య‌శోద (స‌మంత) దిగువ మధ్యతరగతి అమ్మాయి. డెలివరీ గర్ల్ గా పని చేసి చెల్లితో పాటు కాలం గడుపుతుంటుంది. యశోద చెల్లికి అనారోగ్యం చేస్తుంది. వైద్యానికి కావాల్సిన డబ్బు కోసం స‌రోగ‌సి ప‌ద్ధతిలో బిడ్డకి జ‌న్మనివ్వడం కోసం మ‌ధు (వ‌ర‌ల‌క్ష్మి శ‌రత్‌కుమార్‌)కి చెందిన ఈవా ఆస్పత్రిలో చేరుతుంది. ఈవా లో చేరిన తర్వాత అక్కడ వేరే ప్రపంచం వుందని, ఎదో తెలియని కుట్ర జరుగుతుందని యశోద పసిగడుతుంది. త‌న‌తోపాటు బిడ్డల‌కి జ‌న్మనివ్వడం కోసం ఈవాలో చేరిన తోటి అమ్మాయిలు అనుమానాస్పద రీతిలో మాయమైపొతుంటారు. ఇంత‌కీ ఈవాలో ఏం జరుగుతుంది. ? య‌శోద అక్కడ కుట్రని ఎలా పసిగడుతుంది? మ‌ధు గతం ఏమిటి ? ఈవా వెనుక ఎవరున్నారు ? అనేది మిగతా కథ.


విశ్లేషణ :


ఒక మిస్టరీ డెత్ తో కథని చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు. ఓ ఫారిన్ హీరోయిన్ ఇండియాలో అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. ఆమె శరీరంలో ల్యాబ్ కూడా గుర్తించలేని ఒక డ్రగ్ దొరుకుతుంది. మరోపక్కా సమంత ఈవా కేంద్రానికి చేరుతుంది. ఈ రెండు సంఘటనలకు లింక్ వుందని ప్రేక్షకులకు అర్ధమౌతుంది. అయితే ప్రేక్షకుడి ఊహకు కథ అందిన తర్వాత ఊహించని మలుపులతో కథనాన్ని నడపాలి. అప్పుడే ఇలాంటి కథలు నిలబడతాయి. కానీ ఆ ప్రయత్నం జరగలేదు. ప్రతి సన్నివేశం ఊహకి అందిపోతూ సాగుతుంటుంది.


సమంత ఈవాలోకి రావడం అక్కడ అమాయకంగా నటించడం, నలుగురు అమ్మాయిలు కష్టసుఖాలు చెప్పుకోవడం, సిస్టర్ సెంటిమెంట్ .. ఇవన్నీ దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కి బలాన్ని ఇవ్వలేదు. చెప్పడానికి విషయం వున్నప్పుడు దాన్ని కొద్దికొద్దిగా రివిల్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ సెకండ్ హాఫ్ వరకూ అసలు యశోద కథే మొదలుకాదు. సెకండ్ వచ్చేసరికి యశోద మరీ రొటీన్ వ్యవహారంలా మారుతుంది. మధు, యశోద ఫ్లాష్ బ్యాకులు చెప్పాడానికే చాలా సమయం తీసుకున్నారు. మ,మధు ఫ్లాష్ బ్యాక్ షాకింగా వుంటుంది. ఐతే కథలో అసలు క్రైమ్ రివిల్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకోదు. సమంత పాత్రలో వచ్చిన ట్విస్ట్ మాత్రం ప్రేక్షకులు థ్రిల్ ఇస్తుంది. ఇలాంటి సినిమాలు క్లైమాక్స్ చాలా టైట్ గా వుండాలి. యశోద మాత్రం చాలా సుదీర్గంగా సాగడం నిరాశని మిగులుస్తుంది.


నటీనటులు :


యశోద కథ మొత్తం సమంత తన భుజాలపై మోసింది. తన నటనా పరిణితి యశోద పాత్రలో మరోసారి చక్కగా చూపించింది. అమాయకంగా వుంటూనే యాక్షన్ సీన్స్ లో హీరోయినిజం అద్భుతంగా ప్రదర్శించింది.


వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్, ఉన్ని ముకుంద‌న్‌ కు కీలకమైన పాత్రలు దక్కాయి. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ నటన మెప్పిస్తుంది. రావుర‌మేష్‌ల, ముర‌ళీశ‌ర్మ‌, సంప‌త్‌రాజ్‌, శ‌త్రు పరిధిమేర నటించారు.


సాంకేతిక వర్గం :


మ‌ణిశ‌ర్మ కు పాటలు ఇచ్చే అవకాశం రాలేదు కానీ నేపధ్య సంగీతం ఆకట్టుకుంది సుకుమార్ కెమెరా ప‌నిత‌నం రిచ్ గా వుంది. ఈవా సెంటర్ ని తీర్చిదిద్దిన విధానంహాలీవుడ్ స్థాయిలో వుంది.


డైలాగ్ కొన్ని ఆకట్టుకుంటాయి.'' ఇక్కడ అన్నీ నీకే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ తప్పా'' అనే డైలాగ్ సినిమా కంటెంట్ ని అద్భుతంగా రిప్రజంట్ చేసింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బావుంది. కానీ దానిని తెరపై చూపించడం థ్రిల్ మిస్ అయ్యింది.


ప్లస్ పాయింట్స్


కథా నేపధ్యం
సమంత నటన
నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్స్


థ్రిల్ మిస్ కావడం
రొటీన్ సెకండ్ హాఫ్
కొన్ని చోట్ల సాగదీత  


ఫైనల్ వర్దిక్ట్: యశోద .. సమంత వన్ విమన్ షో


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS