Dil Raju: హీరో ఎవరైనా ఓకే... దిల్ రాజు బంప‌ర్ ఆఫ‌ర్‌

మరిన్ని వార్తలు

చిత్ర‌సీమ హిట్టు చుట్టూనే ప్ర‌ద‌క్షిణాలు చేస్తుంటుంది. హీరో, హీరోయిన్‌, డైరెక్ట‌ర్‌.. ఎవ‌రికైనా స‌రే, వాళ్ల చేతిలో హిట్టు ఉండాల్సిందే. వాళ్ల‌కే పెద్ద పీట‌. ఇప్పుడు అలా... అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకొన్నాడు రిష‌బ్ శెట్టి. హీరోగా, ద‌ర్శ‌కుడిగా రెండు ప‌డ‌వ‌ల‌పై ప్ర‌యాణం చేస్తూ కూడా అద్భుత‌మైన విజ‌యాన్ని అందుకొన్నాడు. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏకంగా రూ.300 కోట్లు వ‌సూలు చేసింది. రిష‌బ్ తో సినిమాలు చేయ‌డానికి హీరోలు, నిర్మాత‌లూ రెడీగా ఉన్నారు. ఇప్ప‌టికే గీతా ఆర్ట్స్ రిష‌బ్ పై క‌ర్చీప్ వేసింది. కాంతారా సినిమాని.. తెలుగులో విడుద‌ల చేసింది గీతా ఆర్ట్స్ సంస్థే. అందుకే... అల్లు అర‌వింద్ కి రిష‌బ్ ని లైన్ లో పెట్ట‌డం పెద్ద క‌ష్టం అవ్వ‌లేదు.

 

అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి రిష‌బ్ కి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ అందిన‌ట్టు స‌మాచారం. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు రిష‌బ్ శెట్టిని క‌లిసి... త‌న సంస్థ‌లో సినిమా చేయ‌మ‌ని అడిగిన‌ట్టు టాక్‌. `హీరో ఎవ‌రైనా ఫ‌ర్వాలేదు.. నేను తీసుకొస్తా.. నువ్వే హీరోగా చేసినా ఓకే.. బ‌డ్జెట్ లిమిట్స్ లేవు` అంటూ ఆప్ష‌న్ల‌న్నీ... రిష‌బ్ చేతికే ఇచ్చాడట దిల్ రాజు. ద‌క్షిణాదిన దిల్ రాజుకి తిరుగులేదు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నాడు దిల్ రాజు. అలాంటి నిర్మాత ఆఫ‌ర్ ఇస్తే... రిష‌బ్ ఎందుకు కాదంటాడు? పైగా ఏ హీరోని అడిగినా ఇస్తానంటూ ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చాడు. సో.. రిష‌బ్ టెమ్ట్ అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌. అయితే టాలీవుడ్ లో రిష‌బ్ సినిమా చేస్తే గ‌నుక‌.. తొలి ఆప్ష‌న్ గీతా ఆర్ట్స్‌కే ఇవ్వాలి. ఆ త‌ర‌వాతే... దిల్ రాజు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS