నాని - ఇంద్రగంటి మోహన్‌కృష్ణ కాంబినేషన్‌లో సినిమా టైటిల్ గురించి గత కొన్ని రోజులుగా సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు తాజాగా ఈ సినిమా టైటిల్ కన్‌ఫామ్ చేస్తూ, ఓ పోస్టర్ విడుదల చేశారు.
'వి' అని రెడ్ కలర్‌లో ముద్రించిన అక్షరం ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. అంటే ప్రచారం జరిగినట్లుగానే 'వి' అనే టైటిల్‌కే చిత్ర యూనిట్ కమిట్ అయ్యింది. అయితే ఈ పోస్టర్‌లో ప్రధాన పాత్రధారులైన సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావ్ హైదరీ పేర్లు మెన్షన్ చేశారు. కానీ అసలు పాత్రధారి అయిన నాని పేరు ఎక్కడా కనిపించలేదు. ఇదే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. సోషల్ మీడియా వేదికగా ఇదే క్వశ్చన్ రైజ్ చేశారు. ఈ క్వశ్చన్‌పై నాని స్పందించాడు. నా మొదటి చిత్రంలో నన్ను హీరోగా పరిచయం చేశారు మళ్లీ నా 25వ చిత్రానికి ఆయనే పరిచయం చేస్తున్నారు. అయితే ఈ సారి కొత్తగా.. అంటూ నాని సోషల్ మీడియాలో స్పందించాడు. 'బ్యాడ్ యాస్' అంటూ ఇచ్చిన హింట్‌తో ఈ సినిమాలో నానిది విలన్ పాత్ర అని చెప్పకనే చెప్పేశాడు. ఇంతవరకూ పక్కింటబ్బాయ్‌లా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని ఇకపై విలన్‌గా మారబోతున్నాడు.
నిజానికి విలన్‌గా నటించాలన్న తన కోరికను ఎప్పుడో ఫ్యాన్స్ ముందు బయటపెట్టాడు నాని. ఆ కోరిక ఇలా ఇంద్రగంటితోనే తీర్చుకుంటుండడం విశేషం. 25 చిత్రాలతో హీరోగా తన స్టామినా చూపించిన నాని తాజా చిత్రం 'వి'తో విలన్‌గా ఎన్ని మార్కులు వేయించుకుంటాడో చూడాలిక.