ఈ నెల 21న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా 'జై లవకుశ'. టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లను కొల్లగొడుతోంది. మిక్స్‌డ్ టాక్ వినిపించినప్పటికీ, ఎన్టీఆర్‌కి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. వసూళ్ల విషయంలో ఏమాత్రం ఢోకా లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్‌లో కూడా అదే జోరు ప్రదర్శిస్తున్నాడు ఎన్టీఆర్. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ రోజే ఆ మార్క్‌ని చేరుకుని రికార్డు సృష్టించింది. ఇంతటి విజయాన్ని అందించిన యూఎస్ ప్రేక్షకులకి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు సోషల్ మీడియాలో. మరో పక్క ఈ సినిమా మరింత సక్సెస్ కావడానికి ప్రమోషన్స్ జోరు మరింత పెంచాలని అనుకుంటున్నాడట నిర్మాత కళ్యాణ్‌రామ్. ఫెయిల్యూర్స్ మీదున్న బాబీకి ఈ సినిమాతో మంచి సక్సెస్ దక్కిందనే చెప్పాలి. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో తెరకెక్కిన సినిమా ఇది. మూడు పాత్రల్లో జై పాత్రకి వస్తున్న రెస్పాన్స్ బావుంది. నెగిటివ్ ఛాయల్లో ఎన్టీఆర్ దుమ్ము దులిపేశాడు. సినిమా చూసి వచ్చాక కూడా జై పాత్ర వెంటాడేస్తోంది ప్రేక్షకుల్ని. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్ రోల్‌గా జై పాత్ర గుర్తుండిపోతుంది. దసరాకి అభిమానులకు మంచి కానుక ఇచ్చాడు 'జై లవకుశ'తో ఎన్టీఆర్. దసరా సీజన్ సినిమాకి బాగా కలిసొచ్చే అవకాశం. ఆన్ ది వేలో ఉన్న మరో పెద్ద సినిమా 'స్పైడర్' వచ్చేదాకా 'జై లవకుశ'కి తిరుగే లేదు