అనుష్కకి పదిహేనేళ్లు.!

మరిన్ని వార్తలు

పూరీ కంపెనీ నుండి దిగుమతి అయిన ముద్దుగుమ్మ అనుష్క హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి 15 ఏళ్లు గడిచింది. పూరీ తెరకెక్కించిన ‘సూపర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుష్క, మొదట్లో గ్లామర్‌ తారగానే కెరీర్‌ రన్‌ చేసుకుంటూ వచ్చింది. ‘అరుంధతి’ ఆమె కెరీర్‌ని టర్న్‌ చేసింది. ఈ 15 ఏళ్ల కెరీర్‌ని ‘అరుంధతి’కి ముందు, ‘అరుంధతి’కి తర్వాత అని డివైడ్‌ చేయాల్సి ఉంటుంది. సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకోవడమే కాక, స్టార్‌ హీరోలకు ధీటుగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో బాక్సాఫీస్‌ రికార్డలు కొల్లగొట్టింది.

 

15 ఏళ్ల సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ని చవి చూసిన అనుష్క, ఓ ఈవెంట్‌ ప్లాన్‌ చేసింది. తన తొలి డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌తో సహా, రాఘవేంద్రరావు, రాజమౌళి తదితరులు ఈ ఈవెంట్‌కి హాజరయ్యి, అనుష్కని ఆశీర్వదించారు. ప్రశంసలతో ముంచెత్తేసారు. ప్రస్తుతం అనుష్క ‘నిశ్శబ్ధం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమిళ హీరో మాధవన్‌ కీ రోల్‌ పోషిస్తుండగా, అంజలి, షాలినీ పాండే ఇతర ఇంపార్టెంట్‌ రోల్స్‌లో కనిపిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా నాలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS