రాజ్‌తరుణ్‌ కాన్ఫిడెన్స్‌ మామూలుగా లేదుగా!

మరిన్ని వార్తలు

వరుస ఫెయిల్యూర్స్‌లో వున్నా, యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ తన తదుపరి సినిమాపై ప్రతిసారీ పూర్తి కాన్ఫిడెన్స్‌ ప్రదర్శిస్తున్నాడు. రాజ్‌తరుణ్‌ తాజా చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’ పబ్లిసిటీ పరంగా దూసుకెళ్తోంది. రాజ్‌ తరుణ్‌ సరసన మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్‌ కుమార్‌ కొండా ఈ చిత్రానికి దర్శకుడు. కడుపుబ్బా నవ్వించే కామెడీతో ఈ సినిమా రూపొందిందని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

 

హీరో రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ, ‘ఒరేయ్‌ బుజ్జిగా’ సినిమాతో తన కెరీర్‌లో కొత్త జోష్‌ కన్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. రాజ్‌ తరుణ్‌ సినిమాలకు సంబంధించి ‘ఒరేయ్‌ బుజ్జిగా’ పబ్లిసిటీలో చాలా కొత్తదనంతో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. గత సినిమాల రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ‘ఒరేయ్‌ బుజ్జిగా’ సినిమాపై అంచనాలు పెరుగుతుండడం గమనార్హం. ఈసారి అభిమానుల్ని అస్సలేమాత్రం నిరాశపర్చబోనని రాజ్‌ తరుణ్‌ అంటున్నాడు. మరోపక్క, మాళవికా నాయర్‌ - హెబ్బా పటేల్‌ గ్లామర్‌ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కాబోతోందట.

 

ఇదిలా వుంటే, ఇప్పటికే సినిమాని చూసిన కొందరు సినీ ప్రముఖులు సినిమాకి పాజిటివ్‌ రివ్యూస్‌.. రిలీజ్‌కి ముందే ఇచ్చేస్తుండడం మరో ఆసక్తికరమైన అంశం. ఏదిఏమైనా, వరుస ఫ్లాపుల్లో వున్న రాజ్‌ తరుణ్‌కి ఈ సినిమా హిట్‌ అవడం తప్పనిసరి. ఉగాదికి కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ‘ఒరేయ్‌ బుజ్జిగా’ ప్రేక్షకుల్ని అలరిస్తుందనే ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS