ఈరోజుల్లో ఓ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే చాలా కష్టపడాలి. చాలా అదృష్టముండాలి. కొన్నిసార్లు సినిమా హిట్టయినా... నిర్మాత లాభాలు చవిచూసే అవకాశమే ఉండడం లేదు. అయితే... ఇప్పుడో సినిమా తొలి రోజే... బ్రేక్ ఈవెన్ సాధించేసింది. ఇక మీదట అన్నీ లాభాలే. ఆ సినిమానే `18పేజెస్`. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ఇది. గీతా ఆర్ట్స్ 2 సంస్థ నిర్మించింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. తొలి రోజే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌లో పడిపోయిందని, లాభాల బాట పట్టిందని చిత్రబృందమే ప్రకటించింది.
గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని సొంతంగా విడుదల చేసుకొంది. విడుదలకు ముందే డిజిటల్, శాటిలైట్ రూపంలో... పెట్టుబడి తిరిగొచ్చేసింది. ఇప్పుడంతా లాభమే. క్రిస్మస్ సెలవలు ఈ సినిమాకిబాగా కలిసొచ్చే అవకాశం ఉంది. దానికి తోడు... 18 పేజెస్ తో పాటుగా విడుదలైన ధమాకా.. సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ వసూళ్లు కూడా..`18 పేజెస్`కి మళ్లే అవకాశాలు ఉన్నాయి. సో.. ఈ యేడాది చివరి హిట్... `18 పేజెస్` ఖాతాలో పడిపోయినట్టే.