అల్లు అర్జున్ తెరంగేట్రం చేసిన సినిమా `గంగోత్రి`. రాఘవేంద్రరావు వందో సినిమా ఇది. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. పాటలు సూపర్ హిట్టు. మార్చి 28,2003న ఈ సినిమా విడుదలైంది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 18 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
``నా తొలి చిత్రం విడుదలై నేటితో 18 ఏళ్లు అయింది. నా 18 ఏళ్ల జర్నీలో నాతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతాభావంతో నా హృదయం నిండిపోయింది. ఇన్నాళ్లుగా మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు నేను ధన్యుడిని`` అంటూ బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. `గంగోత్రి`లో బన్నీ చాలా పీలగా కనిపించాడు. తనలోని పూర్తి టాలెంట్ బయటకు రాలేదు. `ఆర్య`తో తన స్టైల్ మొత్తం మారిపోయింది. ఆ తరవాత.. తన ప్రస్థానం తెలిసిందే. స్టైలీష్ స్టార్ గా ఎదిగాడు. గంగోత్రికి గానూ... వెయ్యి రూపాయలు పారితోషికం అందుకున్న బన్నీ.. ఇప్పుడు కోట్ల రూపాయల్ని ఆర్జించే స్టార్ గా మారాడు.