1945 మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: రానా దగ్గుబాటి, రెజీనా కసాండ్రా, సత్యరాజ్, నాజర్
దర్శకత్వం : సత్యశివ
నిర్మాత: సి. కళ్యాణ్
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: సత్య పొన్మార్
ఎడిటర్ : గోపీ కృష్ణ


రేటింగ్: 2/5


బాహుబలి తర్వాత రానా సైన్ చేసిన సినిమా 1945. బ్రిటీష్ వార్ నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రానికి చాలా సినిమా కష్టాలు వచ్చాయి. నిర్మాతలకు హీరోకి మధ్య ఏవో మనస్పర్ధలు. నానా కష్టాలు ఎదురుకొని ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్రానికి కనీస ప్రచారం లేదు. రానా ట్విట్టర్ లో ఒక ట్వీట్  చేయలేదు. కానీ రానా, రేజీనా, నాజర్ , సత్యరాజ్ ఇలా బాహుబలి తారాగణం వుండటం సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి ఎలాంటి ప్రచారం లేకుండ వచ్చిన ఈ సినిమా ఫలితం ఎలా వుందో ఒక్కసారి చూద్దాం.. 


క‌థ:


నేతాజీ మరణం తర్వాత ఈ క‌థ మొదలౌతుంది.  బ్రిటీష్ వార్ సమయంలో వ్యాపారాన్ని చూసుకోవ‌డం కోసం ఆది (రానా ద‌గ్గుబాటి) బ‌ర్మా చేరుకుంటాడు. అదే స‌మ‌యంలో బ్రిటిష్ తహసీల్దార్‌ (నాజ‌ర్‌) కుమార్తె (రెజీనా)తో నిశ్చితార్థం కూడా కుదురుతుంది. పెళ్లికి సిద్ధమ‌వుతున్న ద‌శ‌లో బ్రిటిష‌ర్ల ఆగడాలు హద్దు మీరుతాయి..మ‌రి వాళ్లపై ఆది పోరాటం ఎలా సాగింది.. నేతాజీ స్ఫూర్తి ఆదిలో ఎలా రగిలింది ? అనేది తెరపై చూడాలి. 


విశ్లేషణ :


దేశభక్తి కూడా సినిమాకి మాంచి కమర్షియల్ పాయింట్. బోలెడు దేశభక్తి సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే దేశభక్తి సినిమా తీసే ముందు సినిమా అంటే భక్తి వుండాలి. సినిమాని గౌరవించాలి. ఒక కధని అనుకున్నప్పుడు అది తెరపై ఎలా వస్తుందో చూసుకోవాలి ? కొన్ని మినియం టెక్నికల్ వాల్యూస్ పాటించాలి. డబ్బింగ్ సరిగ్గా చెప్పించామా? ఎడిటింగ్ లో జంప్స్ ఏమైనా ఉన్నాయా ? కంటిన్యుటీ కుదిరిందా ? సరిగ్గా వచ్చిన టేక్ నే ఎడిట్ చేసి ఫైనల్ అవుట్ లో ఇచ్చామా ?ఇలాంటి చిన్నచిన్న సాంకేతిక అంశాలు మనం నిర్మిస్తున్న సినిమాలో వున్నాయో లేదో చూసుకోవాలి. 1945 లో పైన ప్రస్థావించిన అన్ని లోపాలు వున్నాయి. 


రానా ఈ సినిమాని ఎప్పుడో వదిలేశారు. అందుకే ఆయన డబ్బింగ్ కూడా చెప్పలేదు. దర్శకుడు ఈ సినిమాని ఏదో రకంగా థియేటర్ లోకి పంపిచేస్తే చాలు అనుకున్నట్లు వున్నాడు. అందుకే ఏదో రకంగా చివర్లో షూటింగ్ అవసరం వున్న కూడా వాయిస్ ఓవర్ తో సరిపెట్టి సినిమాని వదిలేశారు. థియేటర్ లో చూసిన ప్రేక్షకుడికి కూడా ఈ సినిమా అతుకుల బొంత అనే సంగతి అర్ధమౌతుటుంది. కొన్ని చోట్ల లిప్ సింకు కూడా మిస్ అయ్యిందంటే అర్ధం చేసుకోవచ్చు.. సినిమా నిర్మాణ విలువలు ఎలా వున్నాయి. ఇక ఎమోషనల్ కూడ సినిమా ఏ దశలోనూ కనెక్ట్ కాదు. భావోద్వేగాలు తేలిపోయాయి. ఆ నాటి సెంట్ కనిపించాయి కానీ అందులో ఎమోషన్స్ మాత్రం పండలేదు.  క‌థ‌నం ఏ ద‌శలోనూ సినిమాని ర‌క్తి క‌ట్టించ‌లేదు. 


నటీనటులు :


రానా మంచి నటుడు. ఈ పాత్ర కూడా బావుంది. అయితే ఆరంభం నుంచే రానా నటనలో ఇంటెన్సిటీ కనిపించదు. బహుశా సినిమా బిగినింగ్ నుంచే నిర్మాతలకు రానాకి మధ్య తేడాలు వచ్చాయోమో కానీ రానాలో ఒక అనాసక్తి తెరపై కనిపిస్తుంటుంది. రెజీనా పాత్ర పద్దతిగా వుంది. చాలా రోజుల తర్వాత రేజీనా తెరపై కనిపించడం అదో కొత్తదనం. స‌ప్తగిరి ఓకే. స‌త్యరాజ్‌, నాజ‌ర్‌ పాత్రలని సరిగ్గా వాడుకోలేదు. 


టెక్నికల్ గా : 


సాంకేతికంగా సినిమా ఉన్నంత వుందని చెప్పలేం. కొన్ని సెట్స్ బావున్నాయి. కెమరా పనితనం ఫర్వాలేదు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. ద‌ర్శకత్వలోపాలు చాలా చోట్ల కనిపిస్తాయి.  నిర్మాణ విలువలు విషయానికి వస్తే తగిన బడ్జెట్ లేక సినిమాని అసంపూర్ణంగా ముగించేశారనే చెప్పాలి. 


ప్లస్ పాయింట్స్ : 


1945 నేప‌థ్యం
ఆర్ట్ వర్క్  


మైనస్ పాయింట్స్ 


అసంపూర్ణమైన క‌థ
బలహీనమైన కథనం
నిర్మాణం, దర్శకత్వంలో లోపాలు


ఫైనల్ వర్దిక్ట్:  సినిమా భక్తిలేని ‘1945’


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS