100 కోట్లు సాధ్యమేనా.?

మరిన్ని వార్తలు

తమిళ శంకర్‌ రూపొందించిన '2.0' సినిమాని తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేయనున్న విషయం విదితమే. తెలుగులో రజనీకాంత్‌ సినిమాలకి మంచి డిమాండ్‌ వుంటుంది. అందుకే రజనీకాంత్‌ సినిమాలంటే భారీగా వెచ్చిస్తుంటారు.. డబ్బింగ్‌ రైట్స్‌ కోసం. పైగా, ఇది శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'రోబో' తెలుగులో బంపర్‌ విక్టరీని అందుకుంది. 

దాంతో, '2.0' సినిమా హక్కుల కోసం పోటీ అలా ఇలా కాదు, ఓ రేంజ్‌లో నడిచింది. ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమా 100 కోట్లు కేవలం తెలుగులోనే కొల్లగొడుతుందట. ఇది సాధ్యమేనా.? అంటే, ఏమో శంకర్‌ - రజనీకాంత్‌ మ్యాజిక్‌ వర్కవుట్‌ అయితే అదేమీ అంత కష్టమైన విషయం కాదు. మరోపక్క, ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఈ '2.0' అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. హై టెక్నికల్‌ వాల్యూస్‌ ఈ సినిమా సొంతం. హాలీవుడ్‌ స్థాయి మేకింగ్‌తో సినిమా రూపొందిందనే ప్రచారం జరుగుతోంది. 

అందుకు తగ్గట్టే ప్రోమోస్‌ కూడా విడుదలవుతున్నాయి. ఎల్లుండి ఈ '2.0' ట్రైలర్‌ విడుదల కాబోతోంది. 'ట్రైలర్‌' రిలీజ్‌ని కూడా భారీగా ప్లాన్‌ చేశారు. త్రీడీ ఫార్మాట్‌లో విడుదల చేసే టీజర్‌ కోసమే థియేటర్లకు జనం పోటెత్తే పరిస్థితి వుందిప్పుడు. ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు '2.0' రానున్న సంగతి తెల్సిందే. 

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈజీగా వెయ్యి కోట్ల వసూళ్ళను సాధిస్తుందని అంచనా వేస్తున్నా, ఇప్పుడే ఈ విషయమై ఓ క్లారిటీకి వచ్చేయలేం. తెలుగులో మాత్రం, ఇప్పట్లో పెద్ద సినిమాలేవీ కన్పించడంలేదు గనుక, సినిమా హిట్టయితే.. '2.0' 100 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించేయొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS