బాల‌య్య‌పై విద్యాబాల‌న్ అలిగిందా..?

By iQlikMovies - November 01, 2018 - 10:25 AM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ బ‌యోపిక్ ద్వారా విద్యాబాల‌న్ టాలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇది వ‌ర‌కు చాలామంది ద‌ర్శ‌క నిర్మాత‌లు విద్యాబాల‌న్‌ని టాలీవుడ్‌కి రప్పించాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ.. అది ఎవ్వ‌రికీ సాధ్యం కాలేదు. బాల‌కృష్ణ రంగ ప్ర‌వేశం చేసి, విద్యా బాల‌న్‌ని ఒప్పించి టాలీవుడ్‌కి తీసుకొచ్చాడు. అలాంటి విద్యాబాల‌న్ బాల‌య్య‌పై అలిగిన‌ట్టు స‌మాచారం. అదీ పారితోషికం విష‌యంలో.

`ఎన్టీఆర్‌` బ‌యోపిక్ రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విద్యాబాల‌న్ ని సంప్ర‌దించిన‌ప్పుడు రెండు భాగాల ప్ర‌స్తావ‌న లేదు. ఆమె ఒక సినిమా అనుకునే ఒప్పుకుంది. తీరా చూస్తే.. రెండు సినిమాలుగా ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపాంత‌రం చెందింది. `రెండు సినిమాలు కాబ‌ట్టి, రెండు పారితోషికాలు ఇవ్వాల్సిందే` అని విద్యాబాల‌న్ డిమాండ్ చేసింద‌ని స‌మాచారం.  

దీనిపై బాల‌య్య‌కూడా సానుకూలంగా స్పందించార‌ని, విద్యాబాల‌న్‌కి ఇచ్చిన పారితోషికంలో 50 శాతం పెంచార‌ని స‌మాచారం. కేవ‌లం విద్య‌కు మాత్ర‌మే కాదు.. ఈ సినిమాలో ప‌నిచేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు 50 శాతం పారితోషికం పెంచిన‌ట్టు తెలుస్తోంది. 

విద్య అలిగితే.. అంద‌రికీ ఇలా వ‌ర్క‌వుట్ అయ్యింద‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS