గత కొంతకాలంగా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న 2.0 ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ అయింది.
ఈ విషయమై దర్శకుడు శంకర్ తన ట్విట్టర్ ద్వారా 2.0 ట్రైలర్ ని దీపావళి కానుకగా నవంబర్ 3న విడుదల చేయబోతున్నాము అని ప్రకటించాడు. మొన్నీమధ్యనే విడుదలైన టీజర్ తో అందరికి షాక్ ఇచ్చిన శంకర్ ట్రైలర్ తో అందరి మైండ్ బ్లాక్ చేస్తాడు అని అందరూ నమ్ముతున్నారు.
ఇదిలావుండగా ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఎలా చేయాలి అని ఒక అంచనాకి వచ్చిన దర్శక నిర్మాతలు దానికి అనుగుణంగా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం.
మొత్తానికి నవంబర్ 3న అందరూ షాక్ అవ్వాల్సిందే అని అంటున్నాడు దర్శకుడు శంకర్.