నాని లెక్క మారిందా?

మరిన్ని వార్తలు

నేచురల్ స్టార్ నాని కెరియర్ మంచి జోష్ గా కొనసాగుతోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు . గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇందులో ఒకటి మాస్ ఎంటర్ టైనర్, ఇంకొకటి ఎమోషల్ తో కూడిన క్లాస్ మూవీ. ఈ రెండింటితో నాని స్థాయి మరింత పెరిగింది. ఈ ఏడాది 'సరిపోదా శనివారం' మూవీ తో థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలో మరికొన్నిప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు నాని. ఏడాదికి రెండు సినిమాలతో వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. 


సరిపోదా శనివారం  తరవాత నాని సుజిత్ కాంబోలో చిత్రం మొదలుపెడతారని ప్రచారం జరిగింది. కానీ బడ్జెట్ కారణంగా నిర్మాత డీవీవీ దానయ్య  ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ పెట్టేంత మార్కెట్ నానికి లేని కారణంగా ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది.  నాని సుజిత్ మూవీ ఎప్పుడు ఉంటుందో, ఎవరు నిర్మిస్తారో తెలియదు. కానీ ముగ్గురు నిర్మాతలు లైన్లో ఉన్నట్లు టాక్. ఈ నేపథ్యంలో నాని శ్రీకాంత్ ఓదెల వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. దసరా మూవీతో తనలో ఉన్న మాస్ యాంగిల్ ని పరిచయం చేసిన శ్రీకాంత్ అయితే బెటర్ అని ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే పనిలో ఉన్నారు నాని. 


ఎస్‌ ఎల్‌ వీ సినిమాస్‌ బ్యానర్ పై, సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని, షెడ్యూల్ కి రెడీగా ఉందని సమాచారం. బడ్జెట్ కారణంగా నాని సుజిత్ మూవీ ఆగిపోగా, శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే సినిమా బడ్జెట్ కూడా నాని రేంజ్ కి మించి ఉంది. ప్రస్తుతం ఇదే విషయం నెట్టింట హాట్ న్యూస్ గా మారింది. 200 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారంట మేకర్స్. నాని సినిమా ఇప్పటివరకు ఇంత బడ్జెట్ తో తెరకెక్కలేదు. టైర్ 2  హీరో గా చలామణి అవుతున్న హీరోకి ఇంత బడ్జెట్ ఏ దైర్యం తో పెడుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో హైప్ క్రియేట్ చేయటానికి ఇలా బడ్జెట్ పెంచేస్తున్నారని ట్రేడ్ పండితులు విమర్శిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS