ఇది వరకు ఏ సినిమా ఎన్ని సెంటర్లలో ఎన్ని వందలు ఆడింది అనేది రికార్డు. ఆ తరవాత... ఏ సినిమా ఎన్ని కోట్లు సాధించింది అనేది రికార్డు. ఇప్పుడు అలా కాదు... ప్రతీదీ ఓ రికార్డే. సోషల్ మీడియా వచ్చేశాక.. ఈ అంకెల గారడీ మరింత ఎక్కువైపోయింది. ఎక్కువ వ్యూస్ వచ్చిన ట్రైలర్ దగ్గర నుంచీ.. ఎక్కువ మంది టీవీల్లో చూసిన సినిమా వరకూ అన్నీ రికార్డులే..
వీటిలో టిఆర్‌పీ సాధించుకున్న సినిమాల గురించి అటు సినీ పరిశ్రమ, ఇటు అభిమానులు ఇంకాస్త ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. హిట్ సినిమాలు టీవీల్లో వచ్చినప్పుడు జనం ఎగబడి చూస్తుంటారు. దాన్ని బట్టి టీఆర్‌పీ రేటింగులు నిర్ణయిస్తుంటారు. కొన్ని కొన్నిసార్లు యావరేజ్ సినిమాలకూ టీఆర్‌పీ బాగుంటుంది. త్రివిక్రమ్ సినిమా టీవీలలో ఎప్పుడొచ్చినా రేటింగులు అదిరిపోతుంటాయి. 2018లో టీఆర్‌పీ విషయంలో రికార్డులు సృష్టించిన సినిమాల జాబితా ఇది
గీతా గోవిందం - 20.51
రంగస్థలం - 19.5
భరత్ అనే నేను - 14.60
అరవింద సమేత - 13.7
నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా - 12.15