ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన హెబ్బాపటేల్ '24 కిస్సెస్' చిత్రం వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. టైటిల్‌ని బట్టి ఇది అడల్ట్ మూవీగా ప్రమోట్ అయిపోయింది. అరతేకాదు, ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో ఈ సినిమాపై స్పెషల్ డిబేట్ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమం సినిమాకి నెగిటివ్ ప్రమోషన్ మోసుకొచ్చిందనే చెప్పాలి. అదేదో సినిమాకి ప్లస్ అవుతందని భావించిన చిత్ర యూనిట్ అది కాస్తా రివర్స్ అయ్యేసరికి కాలి బేరానికొచ్చేసింది. మా సినిమా అడల్ట్ మూవీ కాదండోయ్.
మంచి యూత్‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అంటూ ఇప్పుడు కొత్తగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు '24 కిస్సెస్' టీమ్. ఎంత మొత్తుకుంటున్నా ఇప్పుడిక ఆ సినిమా వైపు చూసే వారే కరువయ్యారు. దాంతో ఈ సినిమాని ఫ్యామిలీ మూవీగా ప్రమోట్ చేసే సాహసం చేస్తున్నారు. మా సినిమాలో నో లిప్‌లాక్స్, నో బెడ్‌రూమ్ సీన్స్ అంటూ మొత్తుకుంటున్నారు. ఉన్న ఒకటీ అరా లిప్‌లాక్ సీన్లు కూడా తొలగించేసి, చిన్న చిన్న మార్పులు చేసి మళ్లీ సినిమాని రిలీజ్ చేస్తామంటున్నారు. ఇప్పుడు సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయో, ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో చెప్పలేని పరిస్థితి.
ఏ కంటెన్ట్ ఎందుకు ఎప్పుడు ఎలా క్లిక్ అవుతుందో తెలియడం లేదు. యూత్‌కి కనెక్ట్ అయితే చాలు అనుకోవడానికి లేదు. యూత్ కూడా ఎలాంటి కంటెన్ట్‌కి కనెక్ట్ అవుతున్నారో అన్ని సందర్భాల్లోనూ అర్ధం చేసుకోలేకపోతున్నాం. టైటిల్‌ని బట్టి యూత్‌ని ఎట్రాక్ట్ చేయాలనుకున్నారు. కానీ అది జరగకపోయేసరికి ఇప్పుడు ఫ్యామిలీ మూవీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉన్న మూవీ అని చెబుతున్నారు. ఇప్పుడెంత చెప్పినా, జరగాల్సింది జరిగిపోయాక '24 కిస్సెస్' పుంజుకోవడం కష్టమే సుమీ.!