24 కిస్సెస్‌: లిప్‌ కిస్‌ ఇలాక్కూడా పెట్టొచ్చా?

మరిన్ని వార్తలు

సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన 'కుమారి 21 ఎఫ్‌' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ హెబ్బా పటేల్‌. ఆ తర్వాత 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'నాన్న నేను, నా బాయ్‌ఫ్రెండ్‌' తదితర సినిమాలతో కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకుంది. 

తాజాగా '24 కిసెస్‌' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయోధ్యకుమార్‌ దర్శత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'మిణుగురులు' వంటి విభిన్న కథా చిత్రంతో జాతీయ పురస్కారాలు అందుకున్న దర్శకుడు ఈ అయోధ్య కుమార్‌. అలాంటి చిత్రాన్ని తెరకెక్కించిన ఘనత ఉన్న ఈ డైరెక్టర్‌ ఇలాంటి సినిమా తీశాడేంటా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ సినిమాలో కూడా ఓ కొత్త సందేశం ఇవ్వబోతున్నాడట మన డైరెక్టర్‌. 

టైటిల్‌కి తగ్గట్లుగానే సినిమాలో కిస్సింగ్‌ సన్నివేశాలు ఎక్కువేనట. జస్ట్‌ శాంపిల్‌ కోసమే ట్రైలర్‌లో బోలెడన్ని లిప్‌లాక్స్‌ చూపించేశారు. ఇక ట్రైలర్‌ చూస్తే యూత్‌ ఎట్రాక్ట్‌ కాకుండా ఉంటారా? అంతేకాదండోయ్‌ ఈ సినిమాలో ఒక్కో ముద్దుకీ ఒక్కో అర్ధం చెప్పబోతున్నారట. ముద్దుకి అర్ధమేంట్రా బాబూ అని కొట్టి పారేయకండి. సినిమా చూస్తే, ఆ అర్ధాలేంటో తెలుస్తాయట. ట్రైలరే ఇంత హాట్‌గా ఉంటే, ఇక సినిమా ఇటీవల వచ్చిన హాట్‌ కంటెన్ట్‌ మూవీస్‌ 'ఆర్‌ఎక్స్‌ 100' తదితర మూవీస్‌ని మించిపోయేలానే ఉంది. 

ఇకపోతే ఈ సినిమాలో అదిత్‌ అరుణ్‌ హీరోగా నటిస్తున్నాడు. బాలల హక్కుల కోసం పోరాడే యువకుడి పాత్రలో కనిపిస్తున్నాడీ యంగ్‌ హీరో. హృద్యమైన లవ్‌స్టోరీని చూడ చక్కగా మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారట. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ ఫర్‌ హట్‌ హాట్‌ '24 కిస్సెస్‌'.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS