తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగకి సినిమా పండగ కూడా తోడవుతుంది. సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ టైంలో మంచి వసూళ్లను రాబడుతుంటాయి. మాములు రోజుల్లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్స్, సంక్రాంతి సమయంలో మూడు రోజుల్లోనే వస్తాయి. ప్రతి ఏడాది జనవరి రెండవ వారంలో ఎక్కువ సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరూ తమ సినిమాని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలనీ అనుకుంటారు. ఈ సంక్రాంతి కి కూడా అరడజను కు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల థియేట్రికల్ రైట్స్? ఎంత కలెక్ట్ చేస్తే ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అవుతాయి అనేది చూద్దాం.
మొదట మహేష్ బాబు బోణి కొట్టనున్నాడు. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలు గుంటూరు కారం బిజినెస్ పైన కూడా కనిపిస్తోంది. ఈ మూవీ థియేటర్ రైట్స్ ని 150 కోట్లకి అమ్మినట్లు సమాచారం. వెంకటేష్ సైంధవ్ సినిమా 34 కోట్ల బిజినెస్ తో థియేట్రికల్ రైట్స్ కి వెళ్ళింది. రవితేజ నటించిన ఈగల్ మూవీ 25 కోట్ల బిజినెస్ జరిగింది. కింగ్ నాగార్జున నా సామిరంగ 24 కోట్ల బిజినెస్ తో ఈగల్ కంటే వెనకపడింది.
వీరంతా స్టార్ హీరోలు కొంత మార్కెట్, క్రేజ్ రెండు ఉన్నాయి కానీ ఏమి లేని యంగ్ హీరో తేజ సజ్జా కూడా సంక్రాతి బరిలో పోటీ పడనున్నాడు. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ 14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఈ మ్యాజిక్ ఫిగర్స్ ని ఏ సినిమాలు బ్రేక్ చేసి ఎంత వసూల్ చేస్తాయో. మొత్తానికి ఈ సీజన్ లో దాదాపు రూ.250 కోట్ల బిజినెస్ జరిగినట్టే. మరి 2024 సంక్రాతికి వసూల్ రాజా ఎవరో అనేది చూడాలి.