గుంటూరు కారం... ప్ర‌మోష‌న్లు లేనట్టే?

మరిన్ని వార్తలు

ఈ సంక్రాంతి హాట్ సీట్‌లో కూర్చున్న సినిమా 'గుంటూరు కారం'. సంక్రాంతి సీజ‌న్ మ‌హేష్ బాబుకి బాగానే క‌లిసొచ్చింది. ఈ సంక్రాంతికీ త‌న హ‌వా చూపించాల‌నుకొంటున్నాడు. ఈ సంక్రాంతి రేసులో ఉన్న అన్ని సినిమాల్లోనూ 'పండ‌గ క‌ళ‌' ఉన్న సినిమా... గుంటూరు కార‌మే. అన్ని కుదిరితే.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీ రికార్డుల‌న్నీ ఈ సినిమా తిర‌గ‌రాసే అవ‌కాశం ఉంది.


అయితే గుంటూరు కారం ప్ర‌మోష‌న్లు మాత్రం అంత స‌వ్యంగా జ‌రిగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. మ‌హేష్ ఇప్పుడు దుబాయ్‌లో ఉన్నాడు. 5న తిరిగొస్తాడు. వ‌చ్చాక ఒక‌ట్రెండు రోజులు ప్యాచ్ వ‌ర్క్ ఉంది. ఆ త‌ర‌వాత ప్రీ రిలీజ్ వేడుక నిర్వ‌హిస్తారు. టీమ్ అంతా క‌లిసి ఓ వీడియో ఇంట‌ర్వ్యూ లాంటిది చేసి వ‌దిలేస్తారు. అంత‌కు మించిన ప్ర‌మోషన్లు లేవు. మ‌హేష్ గానీ, త్రివిక్ర‌మ్ గానీ మీడియాకు స్పెష‌ల్ గా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది. త‌మ‌న్‌, శ్రీ‌లీల‌, నాగ‌వంశీ ఎలాగూ మీడియాకు అందుబాటులోనే ఉంటారు.


ఈమ‌ధ్య పెద్ద సినిమాలు ప్ర‌మోష‌న్ల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. 'స‌లార్' అందుకు అతి పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల కోసం ప్ర‌భాస్ ఒక్క‌సారి కూడా మీడియా ముందుకు రాలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జ‌ర‌ప‌లేదు. అయినా ఆసినిమా సూప‌ర్ హిట్ట‌యింది. యానిమ‌ల్ ప్ర‌మోష‌న్లూ అంతంత మాత్ర‌మే జ‌రిగాయి. లియో విష‌యంలోనూ ఇదే రిపీట్ అయ్యింది. ఆయా సినిమాల ఓపెనింగ్స్‌కి కొర‌త లేదు. మ‌హేష్ సినిమాపై ఇప్ప‌టికే మంచి బ‌జ్ ఉంది. పైగా ఇది సంక్రాంతి సినిమా. అందుకే ప్ర‌మోష‌న్ల‌ని లైట్ తీసుకొంటోంది టీమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS