టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర '2.ఓ' దూకుడు కొనసాగుతోంది. తొలి వారంలో ఇప్పటి వరకూ రూ.40 కోట్ల షేర్ దక్కించుకుంది. '2.ఓ' టార్గెట్ రూ.50 కోట్లు. దానికి అత్యంత చేరువలో వచ్చింది. కలక్షన్లలో 'రోబో'ని అవలీలగా దాటేసింది. 'రోబో' అప్పటి సంయుక్త రాష్ట్రంలో రూ.37 కోట్ల వసూళ్లు అందుకుంది. ఓ డబ్బింగ్ సినిమాకి ఆ స్థాయిలో వసూళ్లు రావడం అప్పట్లో ఓ రికార్డు. దాన్ని... 2.ఓ తిరగరాసింది.
ఒక్క నైజాంలోనే రూ.17 కోట్లు సాధించింది. సీడెడ్‌లో రూ.7 కోట్లు వచ్చాయి. గుంటూరు, ఈస్ట్, వెస్ట్, కృష్ణ కలిపి రూ.9 కోట్ల వరకూ వసూలు చేసింది. 2డీ కంటే త్రీడీకి డిమాండ్ ఎక్కువ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ వసూళ్ల జోరు ఈ వారాంతం వరకూ కొనసాగే అవకాశాలున్నాయి.
తెలుగులో థియేటరికల్ రైట్స్ రూపేణా రూ.72 కోట్లకు అమ్ముడైంది. ఆ మొత్తం రాబట్టడం మాత్రం కష్టంగా కనిపిస్తున్నా.. రూ.50 కోట్ల మైలు రాయిని అందుకోవడం మాత్రం 2.ఓకి సులభమే అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.