'ఎన్టీఆర్' బ‌యోపిక్‌లో రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు

By iQlikMovies - December 06, 2018 - 10:55 AM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎన్నో విశేషాలు.. వింత‌లు. ఓ తండ్రి క‌థ‌ని కొడుకు.. పోషించ‌డం, దాన్ని రెండు భాగాలుగా తీయడం ఓ చ‌రిత్ర‌. అందులో వార‌సుల‌కు చోటు ద‌క్క‌డం ఓ అపూర్వ ఘ‌ట్టం. ఏఎన్నార్‌గా.. ఆయ‌న మ‌న‌వ‌డు సుమంత్ క‌నిపిస్తున్నాడు. హ‌రికృష్ణ‌గా ఆయ‌న వార‌సుడు క‌ల్యాణ్ రామ్ న‌టించాడు. ఇప్పుడు మ‌రో వార‌స‌త్వ పాత్ర తెర‌పైకి వ‌చ్చింది. కె.రాఘ‌వేంద్ర‌రావుగా ఆయ‌న త‌న‌యుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి న‌టిస్తున్నారు.

ఎన్టీఆర్‌కీ - రాఘ‌వేంద్ర‌రావుకీ మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రిదీ సూపర్ హిట్ కాంబినేష‌న్‌. వీరిద్ద‌రూ క‌ల‌సి 11 సినిమాలు తీశారు.దాదాపు అన్నీ హిట్టే. అడ‌వి రాముడు, య‌మ‌గోల అయితే చ‌రిత్ర సృష్టించాయి. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లోనూ రాఘ‌వేంద్ర‌రావు పాత్ర‌కు చోటిచ్చారు క్రిష్‌. ఆ పాత్ర‌లో రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడ్ని ఎంచుకున్నారు.

 

షూటింగ్ కూడా అయిపోయింది. 'అడ‌విరాముడు' సెట్లో... ఎన్టీఆర్‌, జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌ల‌కు సూచ‌న‌లిస్తూ.. ప్ర‌కాష్ క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. 'నీతో' అనే సినిమాతో క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్ర‌కాష్‌... ఆ త‌ర‌వాత ద‌ర్శ‌కుడిగా సెటిల్ అయ్యారు. ఇంత‌కాలానికి ఆయ‌న్ని మ‌ళ్లీ తెర‌పై చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS