‘బాహుబలి ది కంక్లూజన్’ సినిమా వచ్చి మూడేళ్ళయ్యింది. ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ టీవ్‌ుతోపాటు, సగటు సినీ అభిమాని సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. నిజానికి, ‘బాహుబలి’ సినిమా మాత్రమే కాదు, అంతకు మించి.! తెలుగు సినిమాగా ప్రారంభమైన ‘బాహుబలి’, జాతీయ స్థాయికి ఎదిగింది.. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. అప్పటికీ ఇప్పటికీ.. ‘బాహుబలి’ రికార్డుల్ని ఇంకే ఇండియన్ సినిమా కొల్లగొట్టలేకపోయిందంటే, ‘బాహుబలి’, ఇండియన్ సినిమాపై వేసిన ముద్ర అలాంటిది. ‘బాహుబలి’ బాటలో చాలా సినిమాలు ‘పాన్ ఇండియా’ రేంజ్ కోసం ప్రయత్నిస్తున్నాయి. సాక్షాత్తూ ప్రభాస్, తన ‘సాహో’ సినిమాతో ప్రయత్నించినా, ‘బాహుబలి’ని దాటలేకపోవడం గమనార్హం.
‘బాహుబలి’కి అన్నీ అలా కలిసొచ్చాయి. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ మాత్రమే కాదు, ఆ సినిమాని ఆయన మార్కెటింగ్ చేసిన విధానం కూడా ఎంతో ప్రత్యేకం. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.?’ అన్న ప్రశ్న, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవడం ‘బాహుబలి’ ఇండియన్ సినిమాపై చూపిన ఇంపాక్ట్‌కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ.. ఇలా నటీనటుల ప్రతిభ, దానికి తోడు కీరవాణి తదితర టెక్నీషియన్ల ప్రతిభ.. ఇవన్నీ ‘బాహుబలి’ని నెక్స్‌ట్ లెవల్‌కి చేర్చాయి. మళ్ళీ ‘బాహుబలి’ని మించిన సినిమా తెలుగు తెరపై ఎప్పుడొస్తుందో ఏమో.!