ఈ మధ్యనే ఓ సెన్సేషనల్ హిట్ కొట్టిన ఓ హీరో, తన కొత్త సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. అయితే, కరోనా వైరస్ ‘కాటు’ కారణంగా చాలా సినిమాలతోపాటు ఆ సినిమా రిలీజ్ కూడా అయోమయంలో పడింది. మరోపక్క ‘ఓటీటీ’ నుంచి భారీ స్థాయిలో సదరు సినిమాకి ఆఫర్లు వస్తున్నాయట. ‘ఓటీటీ’ రిలీజ్‌కి తొలుత ఆ హీరో ససేమిరా అన్నాడని తెలుస్తోంది. అయితే, పరిస్థితులు మారాయి. అట్నుంచి భారీ ఆఫర్ వస్తుండడం, ఇంకో వైపు కరోనా వైరస్ లాక్‌డౌన్ ఇప్పట్లో ముగిసేలా కన్పించకపోవడంతో సదరు హీరో పునరాలోచనలో పడ్డాడనని టాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
‘మే 3వ తేదీ వరకు చూద్దాం.. ఈలోగా పరిస్థితులపై పూర్తి క్లారిటీ వస్తుంది.. ఆ తర్వాత ఆలోచిద్దాం..’ అని ఆ హీరో, ‘ఓటీటీ’ నిర్వాహకులకు సూచించాడని సమాచారం. దియేటర్ రిలీజ్ అయి, సినిమా ఓ మోస్తరు హిట్టయితే ఎంత వసూళ్ళ సాధిస్తుందో, దాదాపు అదే మొత్తం ఆ ‘ఓటీటీ’ సంస్థ ఆఫర్ చేసిందని అంటున్నారు. ఇంకో చిన్న సినిమా నిర్మాత మాత్రం, ఈ ఏడాది తమ సినిమా రిలీజ్ కాకపోయినా ఫర్వాలేదు, ఓటీటీలో మాత్రం రిలీజ్ చేసే ప్రసక్తే లేదని ఇంకా భీష్మించుక్కూర్చున్నారట. ఏదిఏమైనా, ఇది తెలుగు సినీ పరిశ్రమకి కష్టకాలమే. సినిమా దియేటర్లు ఇప్పట్లో తెరుచుకునేలా కన్పించడంలేదు గనుక.. ఓటీటీ తప్ప చాలా సినిమాలకు ఇంకో ఆప్షన్ లేదేమో.