బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా డెబ్యూ చేస్తున్న సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఉగాది సందర్భంగా ఈ సినిమాని మార్చి 25న రిలీజ్ చేస్తున్నామంటూ, చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది. అమృత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. మున్నా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు బాగా క్లిక్ అయ్యాయి.
ముఖ్యంగా ‘నీలి నీలి ఆకాశం..’ పాట యూత్‌లో బాగా ట్రెండిరగ్ అయిపోయింది. చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పను కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ప్రదీప్ ఫాలోవర్స్ ఎదురు చూసారు . డెబ్యూ మూవీ కాబట్టి, ఓ మంచి డేట్ కోసం వెయిట్ చేశాడు. ఎట్టకేలకు మంచి డేట్ ఫిక్స్ కావడంతో, ప్రదీప్ హ్యాపీ. ఇక సినిమా కూడా హిట్ అయితే, మరీ హ్యాపీ. అది మాత్రం ఆడియన్స్ చేతుల్లోనే ఉంది. చూడాలి మరి, హీరోగా ప్రదీప్ మాచిరాజు ఫ్యూచర్ ఎలా ఉంటుందో.