రజనీకాంత్ నటించిన ‘రోబో 2.0’ కోసం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రజనీ కోసం ఓ టాలీవుడ్ హీరో, విలన్‌గా మారబోతున్నాడనే సంకేతాలు అందుతున్నాయి. ఆయన మరెవరో కాదు, హ్యాండ్‌సమ్ హీరో గోపీచంద్ అంటూ ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా రజనీ సినిమాలో గోపీచంద్ నటించబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ వార్తలు కొట్టిపాడేసేవి కావని తాజాగా తెలుస్తోంది.
హీరోగా గోపీచంద్‌కి ప్రస్తుతం ఏమంత కలిసి రావడం లేదు. వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు. సో ఒకే పంథాకి ఫిక్స్ అయిపోకుండా, నేటి జనరేషన్ హీరోలు యాక్టింగ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేస్తున్నారు. అలాగే గోపీచంద్ కూడా డిఫరెంట్ వేరియేషన్ ట్రై చేద్దామనుకుంటున్నాడట. అయితే, అది విలనిజం అని తెలుస్తోంది. అఫ్‌కోర్స్ గోపీచంద్‌కి విలనిజం కొట్టిన పిండే. ఏకంగా ప్రబాస్, మహేష్, నితిన్ వంటి స్టార్ హీరోలకు విలన్‌గా నటించి మెప్పించాడు. ఎవ్వర్ గ్రీన్ విలనిజం చూపించాడు ఆయా పాత్రల్లో గోపీచంద్. సో అదే ట్రాక్ మరోసారి ట్రై చేయానుకుంటున్నాడట. అయితే ఈ సారి పొరుగు భాషను ఎంచుకున్నాడనీ తెలుస్తోంది.
అయితే, ఈ పంథాని పొరుగు భాషకే ఫిక్స్ చేస్తాడా.? లేక సొంత భాషలో కూడా ట్రై చేస్తాడా.? అనేది చూడాలి. ఇకపోతే, ప్రస్తుతం గోపీచంద్, సంపత్ నంది డైరెక్షన్‌లో ‘సీటీమార్’ మూవీలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.