చిత్రసీమకు గడ్డు రోజులు నడుస్తున్నాయి. ఇది వరకే చాలా థియేటర్లు కల్యాణ మండపాలుగా, షాపింగ్ మాల్స్‌గా మారిపోయాయి. ఇప్పుడు మరో 5 ధియేటర్లు చరిత్రలో కలిసిపోయాయి.
హైదరాబాద్ సినీ ప్రియుల్ని దశాబ్దాలుగా అలరించి, తీపి జ్ఞాపకాలు మిగిల్చిన 5 థియేటర్లు ఇప్పుడు కాల గర్భంలో కలసిపోయాయి.
హైదరాబాద్‌లో ఒకప్పుడు సినీ అభిమానుల అడ్డాగా మారిన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ... గెలాక్సీ థియేటర్(టోలిచౌకి), శ్రీ రామ థియేటర్(బహదూర్‌పుర), అంబ థియేటర్(మెహదీపట్నం), శ్రీమయూరి థియేటర్(ఆర్టీసీ క్రాస్ రోడ్), శాంతి థియేటర్(నారాయణగూడ) ... ఇక కనిపించవు. వీటిని గోడౌన్స్ లేదంటే ఫంక్షన్ హాల్స్‌గా మార్చాలని నిర్వాహకులు భావిస్తున్నారట. కరోనాకి ముందే ఈ థియేటర్ల నిర్వహణ చాలా ఇబ్బంది గా ఉండేదని, కరోనా తో మూతపడే స్థితికి వచ్చాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో ఇంకెన్ని థియేటర్లు ఇలా కల్యాణమండపాలుగా మారిపోతాయో..?