స్పోర్ట్స్ డ్రామా మంచి కమర్షియల్ సబ్జెక్ట్. బాగా డీల్ చేయాలే గానీ, మినిమం గ్యారెంటీ ఉంటుంది. బాలీవుడ్ లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామాలన్నీ దాదాపుగా హిట్టే. లగాన్, చెక్ దే ఇండియా లాంటి సినిమాలైతే క్లాసిక్స్. దంగల్ అయితే.. ఇండ్రస్ట్రీ రికార్డ్ సృష్టించింది. 83 పై కూడా అలాంటి ఆశలే ఉండేవి. ఎందుకంటే... క్రికెట్ నేపథ్యంలో సాగే కథ ఇది. స్టార్ హీరోలు, టెక్నీషియన్లు... ఈ సినిమా కోసం పనిచేశారు. ట్రైలర్ చూసి అంతా అవాక్కయ్యారు. కపిల్ దేవ్ లాంటి వాళ్లు ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేశారు. ఈ సినిమా కోసం దాదాపుగా 300 కోట్లు ఖర్చు పెట్టారు.
83 వరల్డ్ కప్ అనేది భారతీయులందరికీ ఓ ఎమోషనల్ మూమెంట్. కాబట్టి... కచ్చితంగా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని, దేశ వ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లని రాబడుతుందని అనుకున్నారు. కానీ తీరా చూస్తే.. ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది. 300 కోట్లలో థియేటర్ నుంచి కనీసం 20 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. శాటిలైట్, ఓటీటీ నుంచి వచ్చిన సొమ్ము మినహాయిస్తే... ఈ సినిమా కు టికెట్ల ద్వారా తెగిన డబ్బులు.. కనీసం ప్రమోషన్లకు కూడా సరిపోవు. అంటే.. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. బాక్సాఫీసు లెక్కల ప్రకారం కనీసం 100 కోట్ల నష్టం వాటిల్లిందని టాక్. 2021లో ఈ సినిమానే అతి పెద్ద డిజాస్టర్ గా బాలీవుడ్ ట్రేడ్ నిపుణులు లెక్కగట్టారు. శాటిలైట్, ఓటీటీ, డిజిటల్ రైట్స్ రూపంలో డబ్బులు రాకపోతే.. ఈ సినిమా తోనిర్మాతలు పూర్తిగా మునిగిపోయేవారు. 83 హిట్టయితే.. 2011 పేరుతో మరో సినిమా తీసేవారు. 2011లో కూడా భారత్ వరల్డ్ కప్ గెలిచింది. ఆ వైనం సినిమాగా వచ్చేది. ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్సయ్యింది.