సూపర్ స్టార్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ వార్త ఘట్టమనేని అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది. రమేష్ బాబు కడసారి చూపుకు కూడా మహేష్ దూరమవ్వడం మరింత బాధాకరం. ఎందుకంటే... మహేష్ ప్రస్తుతం కరోనా బారీన పడ్డారు. ఆయన బయటకు రాకూడదు. దాంతో మహేష్ మరింత శోక సముద్రంలో మునిగారు. తన అన్నయ్యని గుర్తు చేసుకుంటూ, ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు మహేష్.
‘నువ్వే నా ప్రేరణ.. నువ్వే నా బలం.. నువ్వే నా ధైర్యం.. నువ్వే నాకు సర్వస్వం... నువ్వే లేకపోతే.. ఈ రోజు నాలో సగం ఉండేది కాదు. నువ్వు నా కోసం చేసిన ప్రతీదానికీ ధన్యవాదాలు. విశ్రాంతి తీసుకో.. నాకే కానీ మరో జన్మంటూ ఉంటే.. మళ్ళీ నువ్వే నా అన్నయ్య కావాలని కోరుకుంటున్నాను. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తునే ఉంటాను అన్నయ్యా’.. అంటూ మహేష్ ట్వీట్ చేశారు.