భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రేజ్‌ను సంపాదించడం కోసం ఎందరో క్రికెట్ ఆటగాళ్లు కృషి చేశారు. వారిలో ముందు వరుసలో ఉండే ఆటగాడు హర్యానా హరికేన్ కపిల్‌దేవ్. 1983లో ప్రపంచ క్రికెట్‌లో ఇండియాను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ కపిల్ దేవ్. ఈ అసాధారణ జర్నీని `83` చిత్రంగా డైరెక్టర్ కబీర్ ఖాన్ వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఇంగ్లాండ్ వెళ్లి ప్రపంచ్‌కప్‌ను సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్ సారథి కపిల్ దేవ్ పుట్టినరోజు సోమవారం(జనవరి 6). ఈ సందర్భంగా కపిల్‌దేవ్‌కి `83` చిత్ర యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసింది.
ఈ సందర్భంగా 83 సినిమా షూటింగ్ సెట్‌లో కొన్ని కపిల్‌దేవ్, రణ్వీర్ సింగ్ కలిసి ఉన్న ఫొటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫొటోల్లో ఓ దానిలో కపిల్ తన ఫేవరేట్ ఐకానిక్ నటరాజ్ షాట్‌ను ఎలా ఆడేవాడినో గుర్తుకు చేసుకుంటున్నాడు. అదే షాట్‌ను సినిమాలో రణ్వీర్ కూడా ఆడి చూపించడం విశేషం.
ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌లా రణవీర్ సింగ్, సునీల్ గవాస్కర్‌లా తాహిర్ రాజ్ బాసిన్, మదన్‌లాల్‌గా హార్డీ సంధు, మహీందర్ అమర్‌నాథ్‌గా షకీబ్ సలీమ్, బల్వీందర్ సింగ్ సంధుగా అమ్మీ విర్క్, కృష్ణమాచారి శ్రీకాంత్‌గా జీవా, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్, సయ్యద్ కిర్మాణిగా సాహిల్ కత్తార్, దిలీప్ వెంగ్‌సర్కార్‌గా అదినాథ్ కొతారి, రవిశాస్త్రి ధైర్య కార్వా, కృతి ఆజాద్‌గా దినేకర్ శర్మ, యశ్‌పాల్ శర్మగా జతిన్ శర్నా, రోజర్ బన్నిగా నిశాంత్ దహియా, సునీల్ వాల్సన్‌గా ఆర్.బద్రి, ఫరూక్ ఇంజనీర్‌గా బోమన్ ఇరాని, పి.ఆర్.మన్‌సింగ్‌గా పంకజ్ త్రిపాఠిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కపిల్‌దేవ్ భార్య రోమీ పాత్రలో దీపికా పదుకొనె అతిథిపాత్రలో నటిస్తున్నారు. బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న `83` చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నారు.