బతుకమ్మ పండగని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ముందుకు కదులుతుంది తెలంగాణ జాగృతి. ఇందులో బాగంగా బతుకమ్మ పాట కోసం ఈసారి ఏకంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పని చేశారు. రెహ్మాన్ సంగీతంలో 'అల్లి పూల వెన్నెల' అంటూ సాగే బతుకమ్మ పాట విడుదలైయింది. అన్నట్టు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ పాటకు దర్శకత్వం వహించడం మరో విశేషం. మిట్టపల్లి సురేందర్ ఈ గీతానికి సాహిత్యం అందించారు. బృందా మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేశారు.
పాట విషయానికి వస్తే.. మొత్తం రెహ్మాన్ స్టయిల్ లో సాగింది. హుక్ ఫ్రేజ్ .. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని రెగ్యులర్ గా మొదలైన ఈ పాట.. తర్వాత పూర్తిగా రెహ్మాన్ మార్క్ లోకి వెళ్ళిపోయింది. బతుకమ్మ పాటలకి కొంచెం ఫోక్ టచ్ వుంటుంది. కానీ రెహ్మాన్ దిన్ని పూర్తిగా రివర్స్ లో చేశారు. పాటకి క్లాసికల్ టచ్ ఇచ్చారు. రెహ్మాన్ పాటలు స్లోగా ఎక్కుతాయి. ఈ పాటకి కూడా అదే లక్షణం వుంది. చాలా క్లాసికల్ ట్యూన్ వినిపిస్తుంది. వాయిద్యాలు కూడా మెలోడి ప్రధానంగా వినిపించాయి. ఇక గౌతమ్ తనదైన స్టయిల్ కొన్ని మాంటేజ్ షాట్స్ లో అదుర్స్ అనిపించారు. మొత్తానికి బతుకమ్మ పాట రెహ్మాన్ స్టయిల్ లో సరికొత్తగా వినిపించింది.