సోమవారం ఒక్కసారిగా వాట్సప్, ఫేస్ బుక్ సేవలు ఆగిపోయాయి. దాదాపు 7 గంటల పాటు ఈ సేవలు స్థంభించిపోయాయి. దాంతో.... నెటిజన్లు కంగారు పడ్డారు. టైమ్ పాస్ ఏం లేకపోవడంతో ట్విట్టర్ ని వేదిక చేసుకున్నారు. అందులో స్టార్లు కూడా ఉన్నారు.కొంతమంది హీరోయిన్లు ట్విట్టర్ లోకి వచ్చి చాట్ సెషన్ ప్రారంభించారు.
శ్రుతిహాసన్ కూడా ట్విట్టర్ లో తన అభిమానుల్ని పలకరించింది. `నన్నేమైనా అడగండి చెబుతా` అంటూ ఆహ్వానించింది. దాంతో కబుర్లు మొదలైపోయాయి. ఇంతలో ఓ తుంటరి అబ్బాయి.. శ్రుతి హాసన్ ఫోన్ నెంబర్ కావాలని అడిగాడు. దానికి కూడా శ్రుతి సమాధానం ఇచ్చింది.
`100` అంటూ. దాంతో.. అభిమాని షాక్ కి గురయ్యాడు. మిగిలిన వాళ్లంతా.... ఈఫన్ ని ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం శ్రుతి ఫోన్ నెంబర్ ఇదే అంటూ.. సోషల్ మీడియాలో సందడి మొదలైంది. సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతున్నప్పుడు స్టార్లు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అభిమాని అడిగిన ప్రశ్నకూ ఓపిగ్గా, తెలివిగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు శ్రుతి కూడా అదే చేసింది.