ఈమధ్య కొన్ని సీరియస్ సినిమాలు చేసిన అల్లరి నరేష్ ఇప్పుడు మరోసారి తన ఒరిజినల్ జోనర్ లోకి వెళ్లారు. కొత్త దర్శకుడు మల్లి అంకంతో 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా చేస్తున్నారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్. ఈ వేసవిలోనే సినిమా వస్తోంది. తాజాగా టీజర్ వదిలారు. టీజర్ లో దాదాపు ప్లాట్ ని రివిల్ చేశారు. హీరో ఒక తేదిలోగ వివాహం చేసుకోవాలి, లేకపోతే అతను జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడు. ఇక తన పెళ్లి కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఇలాంటి సమయంలో ఫరియా అబ్దుల్లాను చూస్తాడు. తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఆమె కూడా ఆసక్తి చూపిస్తుంది. అయితే పెళ్లి ప్రపోజల్ పెట్టగానే ‘ఆ ఒక్కటీ అడక్కు’ ని షాక్ ఇస్తుంది.
కమర్షియల్ హంగులతో కూడుకున్న ఓ ఫ్యామిలీ డ్రామా ఇది. అందరికీ కనెక్ట్ అయ్యే పెళ్లి చుట్టూ కథని, సన్నీవేశాలని అల్లుకున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. నరేష్, ఫారియా పెయిర్ కొత్తగా వుంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష లాంటి కామెడీ గ్యాంగ్ కూడా వుంది. విజువల్స్ ప్లజెంట్ గా వున్నాయి. గోపిసుందర్ నేపధ్య సంగీతం కూడా జోనర్ కి తగినట్లు వుంది. టీజర్ అయితే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే భరోసా కల్పించింది. మార్చి 22న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.