సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో సంక్రాతి బరిలో నిలిచాడు. ఈ మూవీ అనుకున్నంతగా హిట్ అవకపోయినా, మహేష్ కి మంచి మార్కులు పడ్డాయి. నెక్స్ట్ మహేష్ రాజమౌళితో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రజంట్ ఈ మూవీ మేకోవర్ కోసం బాడీ కూడా బిల్డప్ చేసుకుంటున్నాడు. లుక్స్ కూడా మార్చాడు. ఈ మూవీపై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ కోసం జక్కన్న ఫారిన్ హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్టు, వార్తలు వస్తున్నాయి. స్టార్ క్యాస్టింగ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం తొమ్మిది రకాలుగా మహేష్ లుక్స్ ని జక్కన్న టీమ్ రెడీ చేసినట్టు టాక్. ఇప్పుడు కూడా ఈ మూవీ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది.
ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రాజమౌళి టీమ్ ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా, రోజుకొక న్యూస్ ఫాన్స్ ని ఊరిస్తోంది. ఇప్పటివరకు మహేష్ డ్యూయెల్ రోల్ లో నటించలేదు. ఒక వేళ ఇది నిజమైతే సూపర్ స్టార్ ఫాన్స్ కి డబల్ ట్రీట్ ఇవ్వనున్నట్టే. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారని సమాచారం.
రాజమౌళి అండర్ లోకి వెళ్లే ముందే మహేష్ తన చేతిలో ఉన్న యాడ్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. మహేష్ సినిమాలతో పాటు సమానంగా యాడ్స్ లో కూడా నటిస్తూ కోట్లలలో సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో అభిబస్ యాడ్ కూడా పూర్తిచేశాడు. రాజమౌళి సెట్ లో అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నాడు మహేష్.