ఫహద్ ఫాసిల్ కథానాయకుడిగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఓ సినిమా నిర్మిస్తుంది. సుధీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ గేర్ అనే టైటిల్ ను ప్రకటించారు నిర్మాతలు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడా టైటిల్ వివాదంలో పడింది. ఇప్పటికే ఈ టైటిల్ ఒక తెలుగు సినిమా కోసం రిజిస్టర్ అయినట్లు తెలిపారు సదరు చిత్ర నిర్మాతలు.
ఆది హీరోగా నిర్మాత కేవీ. శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా టైటిల్ కూడా ఇదే. "టాప్ గేర్" టైటిల్ మాది. ఆది హీరోగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈ టైటిల్ పెట్టి షూటింగ్ మొదలుపెట్టాం. రిజిస్ట్రేషన్ కూడా వుంది. ఇప్పుడు మలయాళ సినిమా అదే టైటిల్ తో ఇక్కడ విడుదల చేయడం సరికాదు. దయచేసిన ఆ నిర్మాతలు ఈ టైటిల్ ని మార్చుకోవాలి'' అని చెప్పుకొచ్చారు కేవీ.
శ్రీధర్ రెడ్డి. ఫహద్ ది డబ్బింగ్ సినిమానే కాబట్టి మరి టైటిల్ మార్చుకుంటారేమో చూడాలి.