అంబానీ పెళ్ళికి నో చెప్పిన ఆలియా

మరిన్ని వార్తలు

ప్రస్తుతం టాక్ ఆఫ్ ది కంట్రీ గా మారింది అంబానీ ఇంట పెళ్లి వేడుక. నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్  సెలబ్రిటీస్, సినీ, రాజకీయ ప్రముఖులు అంబానీ ఇంట  వేడుకకి తరలి వచ్చారు. టాలీ వుడ్ నుంచి కూడా రామ్ చరణ్, ఉపాసన దంపుతులు ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి జూలై 12న ముంబై జీ కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరిగింది. పెళ్లికి వచ్చే అతిధుల కోసం ముఖేష్ అంబానీ తన రేంజ్ తగ్గట్టుగానే స్వాగత సత్కారాలు చేశారు.


నిశ్చితార్ధ వేడుక అంబానీ సొంత నగరం గుజ‌రాత్‌ జామ్ న‌గ‌ర్ లో జరిగింది. అప్పుడు కూడా అన్ని దేశాల నుంచి అతిధులు వచ్చారు. నెక్స్ట్ క్రూయిజ్ షిప్ లో  విందు, వేడుకలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ముంబైలో పెళ్లి వేడుకలు నిర్వహించారు. ఈ పెళ్లి వేడుక‌ల‌కు స్పెషల్ అట్రాక్షన్ బాలీవుడ్ స్టార్లు అనటంలో సందేహం లేదు. ఈ పెళ్ళి వేడుకలకి వెళ్లిన సెలబ్రిటీస్ కి కొంత అమౌంట్ ఇస్తారని టాక్. అంద‌రికీ సంబంధిత పీఆర్వోలు ఆహ్వానాలు పంపుతారు. అంబానీ ఇంట వేడుకకి ఆహ్వానం వస్తే వద్దని అనే వారుంటారా? ఎగిరి గంతేసి రెడీ అయిపోతారు వెళ్ళడానికి. పైగా అదేదో అదృష్టంలా ఫీల్ అవుతారు. కానీ ఇందుకు విరుద్ధంగా త‌న‌కు ఎన్నిసార్లు ఆహ్వానం అందినా తిర‌స్క‌రించిందట బాలీవుడ్ ఫేమస్ డైరక్టర్ ముద్దుల తనయ. 


బాలీవుడ్ స్టార్లు అంబానీ పెళ్లి  వేడుకలలో పాల్గోవటానికి రోజులు తరబడి టైం కేటాయిస్తుంటే  బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ మాత్రం ఇందుకు నో చెప్పిందట.  అంబానీల ఆహ్వానాన్ని తిర‌స్క‌రించింది. ఈ పెళ్లికి తాను అటెండ్ అవకూడదని, నిర్ణయించుకున్నాన‌ని పేర్కొంది ఆలియా కశ్యప్. ఆత్మగౌరవం కోసం తాను ఇలా చేసిన‌ట్టు పబ్లిక్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ విషయం గురించి ఆమె స్పందిస్తూ. 'నిజానికి అనంత్ అంబానీ పెళ్లి, పెళ్లిలా కాక  ఒక సర్కస్ లాగా మారింది. న‌న్ను కొన్ని ఈవెంట్‌లకు ఆహ్వానించారు. ఎందుకంటే వారు PR చేస్తున్నారు. కానీ నేను వద్దు అని చెప్పాను. నాకు కొంచెం ఎక్కువ ఆత్మ‌గౌర‌వం ఉందని నేను నమ్ముతున్నాను. ఒకరి పెళ్లికి నన్ను అమ్ముకోవడం కంటే గౌరవం ముఖ్యం అని నేను న‌మ్ముతున్నాను' అని పోస్ట్ చేసి పలువురికి ఆదర్శంగా నిలిచింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS