ఎన్టీఆర్ లో ఆమని రోల్ ఏంటో తెలుసా..?

By iQlikMovies - August 06, 2018 - 18:10 PM IST

మరిన్ని వార్తలు

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి రోజుకొక ప్రకటన వెలువడుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండవ భార్యగా ఆమనిని ఎంపిక చేసినట్టుగా సమాచారం.

అయితే ఇప్పటివరకు ఈ చిత్రంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం వరకే చూపిస్తారు అని అనుకుంటుండగా ఇప్పుడు లక్ష్మీ పార్వతి పాత్రకి ఆమనిని ఎంపిక చేసుకున్నారు అని వినిపిస్తున్న వార్తలతో ఒక్కసారిగా ఈ చిత్రం పైన అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

అదే సమయంలో ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అన్ని ముఖ్య ఘట్టాలు చూపిస్తారు అని తెలుస్తున్నది, దీనితో ఎన్టీఆర్ ద్వీతీయ వివాహం కూడా ఒక ముఖ్య ఘట్టంలా మనకి ఈ చిత్రంలో కనపడొచ్చు అనే అభిప్రాయం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతూనే ఉంది.

ఏదేమైనా ఈ కొత్త పరిణామం ఎన్టీఆర్ బయోపిక్ పైన ఆసక్తిని రెట్టింపు చేసిందనే చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS