విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్‌

మరిన్ని వార్తలు

బాలీవుడ్ లో మ‌రో వైవాహిక జీవితానికి విడాకుల‌తో శుభం కార్డు ప‌డింది. ఆమీర్‌ఖాన్ - కిర‌ణ్ రావులు ఇప్పుడు చ‌ట్ట‌బ‌ద్ధంగా విడిపోయారు. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇటీవ‌లే అమీర్ - కిర‌ణ్‌లు త‌మ 15వ వివాహ మ‌హోత్స‌వం జ‌రుపుకున్నారు. అయితే ఎప్ప‌టి నుంచో ఇద్ద‌రూ విడిపోవాల‌నుకుంటున్నారు. విడాకుల వ్య‌వ‌హారం కోర్టుకెళ్లింది. న్యాయ‌స్థానం ఉత్త‌ర్వుల‌తో.. వీరిద్ద‌రూ చ‌ట్ట‌బ‌ద్ధంగా విడిపోయారు. అమీర్ కి కిర‌ణ్ రెండో భార్య‌. `ల‌గాన్‌` చిత్రానికి కిర‌ణ్ స‌హాయ ద‌ర్శ‌కురాలిగా ప‌నిచేసింది. అప్ప‌టి నుంచో ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం, ప్రేమ చిగురించాయి. ఆ త‌ర‌వాత‌.. ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు.

 

"ఈ పదిహేనేళ్ల సినీ ప్రయాణంలో జీవితానికి సరిపడా ఆనందాలను, అనుభవాలను, నవ్వులను పంచుకున్నాం. మా మధ్య బంధం అనేది నమ్మకం, గౌరం, ప్రేమల నుంచి పుట్టింది. ఇప్పుడు ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. ఇకపై భార్య భర్తలుగా కొనసాగలేం. అయితే కుటుంబం కోసం సహ తల్లిదండ్రులుగా బాధ్యతను తీసుకుంటాం. కొంతకాలం నుంచి విడి విడిగానే ఉంటూ వస్తున్నాం. వేర్వేరుగా మా జీవితాలను, కుటుంబాలను విస్తరించుకోవడానికి ముందుకెళతాం. మా కొడుకు అజాద్‌ పెంపెకంలో ఇద్దరం కలిసే ఉంటాం. అలాగే మేం చేస్తున్న, చేయబోయే సినిమాలు, పానీ ఫౌండేషన్‌ వ్యవహారాల్లోనూ కలిసే ముందుకెళతాం. మమ్మల్ని అర్థం చేసుకుని మాకు నిరంతర మద్దతుని తెలియజేసిన మా కుటుంబాలకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. మీ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తారని భావిస్తున్నాం. విడిపోవాలనుకోవడం అనేది ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ప్రారంభమని భావిస్తున్నాం" అంటూ తమ లేఖలో ఆమిర్‌ఖాన్, కిరణ్‌రావు పేర్కొన్నారు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS