'ఆటగాళ్లు' అదరగొట్టేశారు.!

మరిన్ని వార్తలు

విలక్షణ నటుడు నారా రోహిత్‌, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆటగాళ్లు'. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. 

ట్రైలర్‌ చాలా బాగుంది. ఓ హార్డ్‌ కోర్‌ క్రిమినల్‌ లాయర్‌కీ, ఓ సామాన్యుడికీ మధ్య జరిగే గేమ్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోందని ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. నారా రోహిత్‌ ఈ చిత్రంలో ఫిల్మ్‌ డైరెక్టర్‌ పాత్రలో కనిపిస్తున్నాడు. 'నేను ఇంతవరకూ చాలా లవ్‌ స్టోరీస్‌ డైరెక్ట్‌ చేశాను. కానీ నా లవ్‌ స్టోరీకి వచ్చేసరికే..'అంటూ స్టార్ట్‌ అయిన ట్రైలర్‌, హీరోయిన్‌ గ్లామర్‌ షోతో మిళితమై, బ్రహ్మానందం కామెడీ ట్రాక్‌, కాస్త యాక్షన్‌, కోర్టు సీన్లు ఇలా చాలా ఎమోషన్స్‌ చూపించారు. 

'ఓ హార్డ్‌ కోర్‌ క్రిమినల్‌ లాయర్‌తో గేమ్‌ ఆడితే ఎలా ఉంటుందో అర్ధమైంది కదా ఎంజాయ్‌ ద గేమ్‌.. ' అని లాయర్‌గా జగపతిబాబు చెప్పే డైలాగ్‌ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచింది. అలాగే 'నౌ ద గేమ్‌ ఈజ్‌ ఫినిష్ట్‌' అంటూ ట్రైలర్‌ చివరల్లో నారా రోహిత్‌ చెప్పే డైలాగ్‌, ఆయన బాడీ లాంగ్వేజ్‌ ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్‌గా దర్శనా బానిక్‌ అందాల విందు సినిమాకి హైలైట్‌ కానుందని ట్రైలర్‌తోనే చెప్పేశారు. 

సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా, కథ నచ్చితే చాలు వెంటనే ఓకే చేసే కథానాయకుడు నారా రోహిత్‌. అందుకే ఆయన సినిమాలు కొత్తగా ఉంటాయి. ఖచ్చితంగా నారా రోహిత్‌ నుండి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్‌ అండ్‌ డిఫరెంట్‌ స్టోరీ 'ఆటగాళ్లు' అవుతుందని చెప్పేయొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS