కమెడియన్ శంకర్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'శంభో శంకర'. తొలి రోజే 2 కోట్ల 53 లక్షల గ్రాస్ వచ్చేసిందని ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. దీన్నో రికార్డుగా పేర్కొంటున్నారు. ఇలాంటి రికార్డులు కూడా ఉంటాయా? అని జనం ఆశ్చర్యపోతున్నారు.
కమెడియన్‌గా పాపులర్ అయిన శంకర్ తొలి సినిమాతోనే హీరోగా తనకు సంబంధం లేని జోనర్‌ని ఎంచుకుని బోల్తా కొట్టాడు. కమెడియన్ సినిమాలో కామెడీ లేకపోవడం పెద్ద లోటు. రికార్డుల హంటర్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. సునీల్ అంతటోడికే ఫ్లాపులు వస్తే, కెరీర్ అయోమయంలో పడిపోయింది. శంకర్ కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సింది. అది సినిమా విషయంలోనైనా, మాటల విషయంలోనైనా. విడుదలకు ముందే కాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది.
అదంతా సినిమా ప్రమోషన్‌కే మాట్లాడానని. అయినా అదంతా సరదాగా మాట్లాడానని శంకర్ ఇప్పుడు నాలుక కొరుక్కుంటున్నాడు. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయ్యింది శంకర్ పరిస్థితి. శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి నిర్మించారు. విడుదలకు ముందు కాస్తో కూస్తో అంచనాలు పెంచింది కానీ విడుదలయ్యాక శంకర్‌కి అస్సలు కలిసి రాలేదు. తనకు సూటయ్యే జోనర్ అయిన కామెడీ జోనర్‌ని ఆశ్రయించి ఉంటే బాగుండేదని జబర్దస్త్ కంటెస్టెంట్ షకలక శంకర్‌గా ఆయన అభిమానులు భావిస్తున్నారు.
పవర్‌ఫుల్ డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్, రక్తపాతం, సెంటిమెంట్ అబ్బో.. ఇలా తనకు అస్సలు సూట్ కాని ఎమోషన్స్‌తో హీరోగా తొలి సినిమాకే విసిగించేశాడు శంకర్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వాపోతున్నారు.