అబిజీత్‌ని ‘లాక్‌’ చేస్తున్న బిగ్‌బాస్‌.. ఏంటి కథ.?

మరిన్ని వార్తలు

బిగ్‌హౌస్‌లో మిగతా కంటెస్టెంట్స్‌తో పోల్చితే అబిజీత్‌ కాస్త భిన్నంగా కనిపిస్తున్నాడు. ఇటు మోనాల్‌ గజ్జర్‌తోనూ అటు అలేఖ్య హారికతోనూ ‘పులిహోర’ కలుపుతున్నాడంటూ అబిజీత్‌ మీద ఇప్పటికే ఓ ఇంప్రెషన్‌ పడిపోయింది. తాజాగా సుజాతతో కూడా పులిహోర కలుపుతున్నట్లుగా అతని మీద ప్రమోషన్‌ జరుగుతోంది. ‘పులిహోర రాజా’ అనే టైటిల్‌ కాస్తా మనోడికి ఫిక్సయిపోయేలా వుంది. ఇంకోపక్క అబిజీత్‌ ఏం మాట్లాడినా దాన్ని తప్పుపడుతున్నాడు అఖిల్‌ సార్దక్‌. బిగ్‌బాస్‌లో ఏం జరిగినా దానికి ఓ ‘పర్పస్‌’ వుంటుంది.

 

అదే పబ్లిసిటీ. ఎవర్ని ఎలా చూపిస్తే, షో రేటింగ్స్‌ పెరుగుతాయో ఆలోచించి, దానికి సంబంధించిన సీన్స్‌ మాత్రమే ఎలివేట్‌ అవుతుంది. అంతే తప్ప, ఆయా వ్యక్తుల ‘వ్యక్తిత్వం అదే’ అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇదిలా వుంటే, తమ అభిమాన నటుడి ఇమేజ్‌ డ్యామేజీ అవుతోందంటూ అబిజీత్‌ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. తద్వారా ‘టీవ్‌ు అబిజీత్‌’ వెరీ వెరీ స్ట్రాంగ్‌ అవుతోంది సోషల్‌ మీడియాలో. బిగ్‌బాస్‌కి కావాల్సింది కూడా అదే. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో అబిజీత్‌ని ఉద్దేశించి హోస్ట్‌ నాగ్‌, స్టేజీ మీదనే కొన్ని ప్రశ్నలు వేశాడు.. ఎవర్ని పెళ్ళి చేసుకుంటావని ప్రశ్నిస్తూ కొన్ని ఫొటోలు కూడా చూపించాడు. అందులో మోనాల్‌ ఫొటోని చూసి పెళ్ళాడతానన్నాడు అబి. సో, టాప్‌ 5లో అబి పేరు ఖచ్చితంగా వుండబోతున్నాడు. కానీ, ఈ పులిహోర రాజా ఇమేజ్‌ మాటేమిటి? ఏమో, ఈ పులిహోర రాజా కథ ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS