చిత్రసీమలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో విశాల్ ఒకడు. తన మీద బోలెడన్ని రూమర్లు బయటకు వచ్చాయి. ఈమధ్య అయితే మేటర్ పెళ్లి వరకూ వెళ్లిపోయిందని కూడా అనుకొన్నారు. ఓ హీరోయిన్ తో క్లోజ్ గా ఉంటున్నాడని, తనతో త్వరలోనే పెళ్లంటూ వార్తలు ఊపందుకొన్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అభినయ. విశాల్ తో కలిసి మార్క్ ఆంటోనీ సినిమాలో నటిస్తోంది అభినయ. ఈ సినిమాతో వీరిద్దరి పరిచయం మొదలైందని, అది ప్రేమగా మారిందని, ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తమిళ మీడియాలో అయితే.. దీనిపై విపరీతమైన ప్రచారం జరుగుతోంది. దాంతో అభినయ ఎట్టకేలకు నోరు విప్పింది.
విశాల్ తో తనది స్నేహం మాత్రమే అని, తను ఓ మంచి కో స్టార్ అని, అంతకు మించి తామిద్దరి మధ్యా ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ సినిమాలో తామిద్దరూ భార్య భర్తల్లా నటిస్తున్నామని, సినిమాల్లో అలా కలిసి నటిస్తే.... బయట పెళ్లయిపోతుందా? రీలు జీవితం వేరు - రియల్ జీవితం వేరు అని చెప్పుకొచ్చింది అభినయ. బాలీవుడ్ లో ఓ సినిమా విడుదల అవుతోందంటే... ఆ సినిమాలో నటించిన హీరో - హీరోయిన్లకు లింకుందంటూ వార్తలు పుట్టించడం చాలా కామన్. అలాంటి పుకార్ల వల్ల ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది. తమిళ సినిమా వాళ్లు కూడా ఈమధ్య ఇలాంటి ట్రెండే ఫాలో అవుతున్నారు. బహుశా... ఈ ప్రేమ వ్యవహారం కూడా ప్రచారంలోనే భాగమేనేమో...?