Samantha: పీక్ టైమ్‌లో వీకైపోయిన స‌మంత‌

మరిన్ని వార్తలు

త‌న కెరీర్‌లోనే అత్యంత ఉచ్ఛ ద‌శ‌లో ఉంది స‌మంత‌. చేతి నిండా సినిమాలున్నాయి. దాదాపు అన్నీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. వెబ్ సిరీస్‌లు ఒప్పుకొంటోంది. బాలీవుడ్ నీ ట‌చ్ చేసింది. ఐటెమ్ గీతాల‌కు రెడీగా ఉన్నానంటూ సంకేతాలు పంపింది. ఇలాంటి ద‌శ‌లో ఓ అరుదైన వ్యాధి స‌మంత‌ని ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది. తాను మ‌యో సైటిస్ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నాన‌ని, దానికి సంబంధించిన చికిత్స తీసుకొంటున్నాన‌ని స‌మంత ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దాంతో.. చిత్ర‌సీమ షాక్ అయ్యింది. మ‌యో సైటిస్ చిన్న స‌మ‌స్యేం కాదు. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఒంటరిగా ఉండ‌లేని ప‌రిస్థితి. కాసేపు కూడా నిల‌బ‌డ‌లేరు. ఒంట్లో అవ‌య‌వాలు అప్పుడ‌ప్పుడూ స‌హ‌క‌రించ‌వు. ఇవ‌న్నీ స‌మంత‌ని సినిమాల‌కు, షూటింగుల‌కు దూరం చేసే ప్ర‌మాదం ఉంది. స‌మంత ఇప్పుడు కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. త‌న‌కు ఈ స‌మ‌స్య ఎప్పుడు క్లియ‌ర్ అవుతుందో డాక్ట‌ర్లు కూడా చెప్ప‌లేరు. అంటే... త‌న చేతిలో ఉన్న సినిమాలు డేంజ‌ర్‌లో ప‌డిన‌ట్టే. `ఖుషి` అనే సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకొంది స‌మంత‌. డిసెంబ‌రులో ఈసినిమా విడుద‌ల కావాల్సివుంది. కానీ స‌మంత కాల్షీట్లు ఇవ్వ‌డం లేదు. న‌వంబ‌రులో స‌మంత కాల్షీట్లు ఇస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. తీరా చూస్తే ఇప్పుడు త‌న‌కున్న వ్యాధి గురించి బ‌య‌ట ప్ర‌పంచానికి తానే స్వ‌యంగా చెప్పింది. స‌మంత వ‌ల్ల‌.. ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఇబ్బందుల్లో ప‌డే ప్ర‌మాదం వ‌చ్చింది. త‌న చేతి నుంచి కొన్ని సినిమాలు చేజారిపోవొచ్చు కూడా. స‌మంత త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, మ‌ళ్లీ సినిమాల్లో రావాల‌ని, షూటింగుల‌తో బిజీ అవ్వాల‌ని స‌మంత అభిమానులే కాదు.. ద‌ర్శ‌క నిర్మాత‌లూ గ‌ట్టిగా కోరుకొంటున్నారు. గెట్ వెల్ సూన్ స‌మంత‌...!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS