దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఇప్పటికే వెంకీ, రానా తదితర హీరోలు స్టార్స్‌గా వెలుగొందుతున్నారు. త్వరలోనే మరో దగ్గుబాటి హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు, రానా సోదరుడు అభిరామ్. రానా సోదరుడు అంటే ఓ విషయం గుర్తొచ్చే ఉంటుంది. వివాదాస్పద నటి శ్రీరెడ్డితో అభిరామ్ రాసలీలల హల్‌చల్ సంగతి గుర్తొస్తుంది కదా! అబ్బే.. వదిలేయండిలే అది గడిచిపోయిన సంగతి. ఇప్పుడీ రొమాంటిక్ కుర్రోడు హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు.
తమిళంలో ధనుష్ నటించిన 'అసురన్' మూవీతో అభిరామ్ డెబ్యూ ఇవ్వనున్నాడంటూ టాక్ వచ్చింది. అయితే, తాజాగా సురేష్ బాబు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అభిరామ్ ఎంట్రీ రీమేక్ మూవీతో కాదనీ, ఓ రొమాంటిక్ స్టోరీతో ఉండబోతోందనీ క్లారిటీ ఇచ్చేశాడు. 'అసురన్' రీమేక్‌లో వెంకటేష్ నటించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక అభిరామ్ విషయానికి వస్తే, ఆల్రెడీ ఓ క్యూట్ రొమాంటిక్ స్టోరీకి స్క్రిప్టు పనులు వేగంగా జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరోవైపు అభిరామ్ ప్రస్తుతం యాక్టింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడట. ఈ లోగా అభిరామ్ తెరంగేట్రానికి సర్వం సిద్ధం చేయనున్నారన్న మాట.