అదేంటో బన్నీ అంటే ఇష్టపడని ముద్దుగుమ్మలుండరు. టాలీవుడ్‌కి పరిచయమయ్యే భామలే కాదు, బాలీవుడ్ భామల్లో కూడా కొందరికి బన్నీ స్టైల్ అంటే చాలా ఇష్టం. అలా బన్నీ ఫేవరేట్స్ లిస్టు చాలా పెద్దదే. ఆ లిస్టులోకి తాజాగా 'మెంటల్..' భామ నివేదా పేతురాజ్ కూడా చేరిపోయింది. ప్రస్తుతం ఈ అందాల భామ బన్నీతో 'అల వైకుంఠపురములో..' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. బన్నీతో నటించడం చాలా సంతోషంగా ఉందని చెబుతోంది. బన్నీ ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టమంటోంది. బన్నీతో పాటు, సీనియర్ నటి టబు కూడా మోస్ట్ ఎనర్జిటిక్ అని నివేదా చెబుతోంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో తానూ భాగమైనందుకు ఆనందంతో ఉరకలేస్తోంది.
'మెంటల్ మదిలో..' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే పర్‌ఫామెన్స్ పరంగా మంచి పేరు తెచ్చుకుంది. లేటెస్ట్‌గా 'చిత్రలహరి' సినిమా నివేదా కెరీర్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఇప్పుడు 'అల వైకుంఠపురములో..' ఆశించిన రిజల్ట్ అందుకుంటే ఇప్పట్లో నివేదా వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కి ఇప్పటికే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మెంటల్ భామ ఆశలు ఫలించి, 'అల..'తో అలలు అలలుగా ఆమె సినీ భవిష్యత్తు ఉవ్వెత్తున ఎగసి పడాలని ఆశిద్దాం.