పవన్ కళ్యాణ్ పైన పరువునష్టం దావా

By iQlikMovies - April 21, 2018 - 18:17 PM IST

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల పేరిట నిన్న ఫిలిం చాంబర్ వద్ద కొందరు ఒక ప్రముఖ మీడియా సంస్థకి చెందిన మీడియా వాహనాలని ద్వంసం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.

ఇక ఈ దాడికి అలాగే సదరు ఛానల్ పైన పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలకి సమాధానంగా ఆ ఛానల్ వారు పవన్ కళ్యాణ్ పైన సుమారు రూ 10కోట్ల మేర పరువునష్టం దావా వేయాలని ఆలోచిస్తున్నట్టు ఆ మీడియా ద్వారా వార్తలు వెలువడుతున్నాయి.

అయితే ఈ పరువు నష్టం నోటిసులకి, కేసులకి తాను ఎప్పుడు భయపడను అని ఇప్పటికే పవన్ ప్రకటించడం జరిగిపోయింది. దీనితో పవన్ ఈ పరువు నష్టం కేసులని చాలా తేలిగ్గా తీసుకుంటాడు అనే చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS