శ్రీ రెడ్డి సీక్రెట్స్ బయటపెడుతున్న కళ్యాణి

By iQlikMovies - April 21, 2018 - 18:15 PM IST

మరిన్ని వార్తలు

ఈమధ్యకాలంలో టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు శ్రీ రెడ్డి. ఇక శ్రీ రెడ్డి ఎపిసోడ్ లో కొందరు నటీనటులు కూడా కొన్ని చర్చావేదికల్లో తమ తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

ఆ తరుణంలో పలు చర్చా వేదికల్లో నటి కరాటే కళ్యాణి పాల్గొనడం ఆమె తనదైన శైలిలో ఆమె ఈ అంశం పైన స్పందించింది. ఆ సమయంలో శ్రీ రెడ్డి కి నటి కళ్యాణికి కొన్ని విభేదాలు కూడా పెడచూపాయి. ఈ సందర్భంగా కరాటే కళ్యాణి కొన్ని సంచలనాత్మక ఫోటోలని విడుదల చేసింది.

ఆ ఫోటోలు ఏంటంటే- శ్రీ రెడ్డి కొంతకాలం క్రిందట తన సొంత ఇంటి గృహప్రవేశం చేసినప్పటివి. ఇక అలాగే శ్రీ రెడ్డికి ఒక కూతురు కూడా ఉంది అంటూ చెప్పడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. అసలే ఇప్పుడు శ్రీ రెడ్డి అంశం హాట్ టాపిక్ అవ్వగా, మళ్ళీ ఇటువంటి వార్తలు వస్తుండడం మరొక ఆసక్తికర చర్చకి దారితీస్తున్నది.

అయితే ఈ ఫోటోల గురించి శ్రీ రెడ్డి ఇంకా స్పందించలేదు.   

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS